హాంకాంగ్‌లో మహిళకు లైంగిక వేధింపులు

హాంకాంగ్‌, ‌సెప్టెంబర్‌ 13 :‌హాంకాంగ్‌లో ఓ మహిళను లైంగిక వేధింపులకు గురి చేసిన భారత సంతతికి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. దక్షిణ కొరియాకు చెందిన ఓ యువతి.. హాంకాంగ్‌లో పర్యటిస్తూ, తన పర్యటన వివరాలను కెమెరాలో బంధిస్తున్నారు. అంతలోనే ఓ వ్యక్తిని ఆమెను ఫాలో అయ్యాడు. ఏదో అడ్రస్‌ ‌గురించి ఆమెను అడిగి మాట కలిపాడు. అనంతరం ఆమెను వెంబడిస్తూ.. నేను ఒక్కడినే ఉన్నాను.. నాతో రండి అని వేధించాడు. ఆమెను తాకేందుకు యత్నించాడు.

దీంతో ఆమె చికాకుకు గురైంది. నో.. నో.. అంటూ గట్టిగా అరిచింది. సౌత్‌ ‌కొరియా మహిళ మెట్రో స్టేషన్‌ ‌వద్ద మెట్లు ఎక్కుతుండగా, ఆమెను గొడకు నొక్కి బంధించాడు. నేను ఒక్కడినే ఉన్నాను.. నాతో రా అని డిమాండ్‌ ‌చేశాడు. నేను ఒంటరిగా లేను అంటూ అతడిని ఆమె తోసేసింది. మహిళను గట్టిగా కౌగిలించుకొని, బలవంతంగా కిస్‌ ఇచ్చాడు.దీంతో బాధితురాలు బోరున విలపించగా, అక్కడ్నుంచి అతను పరారీ అయ్యాడు. నిందితుడిని మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *