రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 9 : మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ వోటర్లకు బహిరంగ లేఖ రాశారు. హాత్ సే హాత్ జోడో పాదయాత్ర కారణంగా నేరుగా కలువలేక పోతున్నానని..ఉపాధ్యాయుల సమస్యల పట్ల పోరాడే హర్షవర్ధన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. వొచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 75 అసెంబ్లీ సీట్లు వొస్తాయని తెలిపారు.
మరోవైపు శుక్రవారం కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించే సభ విజయవంతం కోసం నేతలందరూ సిద్ధమయ్యారు. కరీంనగర్ సభకు రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు థాక్రె, చత్తీస్ఘఢ్ ముఖ్యమంత్రి సహా రాష్ట్ర సీనియర్ నాయకులు హాజరుకానున్నారు.



