సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 2: సిద్దిపేటలో హరీష్ రావు పోటీ చేస్తున్న ప్రతిసారి మెజార్టీ పెరగడం సాంప్రదాయంగా వస్తుందని.. ఈసారి కూడా అదే సాంప్రదాయం కొనసాగుతుందని, బీఆర్ఎస్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, పట్టణ అధ్యక్షులు కొండం సంపత్ రెడ్డి, జాప శ్రీకాంత్ రెడ్డి,పాల సాయిరామ్ కలిసి ఆయన మాట్లాడారు.. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మంత్రి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ఎన్నికలలో భాగంగా తాము ప్రచారానికి వెళ్లినప్పుడు ప్రతి ఇంట్లో తమకు అపూర్వ స్పందన లభించింది అన్నారు.. అన్ని కుల సంఘాలు అసోసియేషన్ల నాయకులు, ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి హరీష్ రావుకు మద్దతు తెలపడం అభినందనీయం అన్నారు..అన్ని వర్గాల ప్రజల అభిమానాన్ని పొందిన హరీష్ రావు భారీ మెజార్టీ సాధించడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. స్వల్పంగా పోలింగ్ శాతం తగ్గినప్పటికీ హరీష్ రావుకు మాత్రం ఓట్లు పెరుగుతాయని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ గెలుపుకు కృషిచేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.ఈ మీడియా సమావేశంలో బిఆర్ఎస్ నాయకులు మెరుగు మహేష్, వడ్లకొండ సాయి, పలువురు పాల్గొన్నారు.
హరీష్ రావు భారీ మెజార్టీ సాధించడం ఖాయం



