హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 14 : మంత్రి హరీష్ రావును గోషామహాల్ ఎమ్మెల్యే రాజసింగ్ కలిశారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధుల కేటాయింపుపై మంత్రి హరీష్ రావును కలిసి చర్చించారు. వివిధ పనులకు సంబంధించి నిధులు విడుదల చేయాలని కోరారు. ఇదే విషయాన్ని రాజాసింగ్ చెప్పారు. అయితే తాజా రాజకీయ పరిస్థితుల్లో వీరిద్దరి భేటీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాజాసింగ్ బీఆర్ఎస్లో చేరబోతున్నారనే ప్రచారం మొదలైంది. దాదాపు ఏడాది క్రితం రాజాసింగ్‌పై బీజేపీ సస్పెన్షన్ వేటు వేసింది. సస్పెన్షన్‌ను ఎత్తి వేయించేందుకు బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎంతగానో ప్రయత్నిం చారు.
కానీ బీజేపీ మాత్రం ఎత్తివేయలేదు. పైగా ఆయనకు పార్టీలో కూడా ఏమాత్రం ప్రాధాన్యత ఉండటం లేదని టాక్. ఈ నేపథ్యంలో ఆయన కాస్త మనస్తాపంలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో హరీష్‌రావును రాజాసింగ్ కలవడం ఆసక్తికరంగా మారింది. గత ఏడాది ఆగస్టు 22వ తేదీన సోషల్ వి•డియాలో రాజాసింగ్ ఓ వీడియో అప్లోడ్ చేశారు. ఈ వీడియోలో మహ్మద్ ప్రవక్తను కించపర్చేలా ఉందని ఎంఐఎంతో పాటు ముస్లింలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే రాజాసింగ్‌పై బీజేపీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది. సెప్టెంబర్ 2లోగా వివరణ ఇవ్వాలని రాజాసింగ్‌ను అప్పట్లో పార్టీ ఆదేశించింది.
బీజేపీ శాసనసభా పక్ష నేత స్థానం నుంచి కూడా పార్టీ ఆయనను తొలగించింది. కాగా.. రాజాసింగ్ అప్లోడ్ చేసిన వీడియోలో మహ్మద్ ప్రవక్తను కించపర్చేలా ఉందని ఎంఐఎంతో పాటు ముస్లింలు ఆందోళన వ్యక్తం చేశారు. రాజాసింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. దీంతో ఆగస్టు 23న ఆయనను అరెస్ట్ చేశారు. అయితే అదే రోజు ఆయనకు నాంపల్లి కోర్టు బెయిల్ ఇచ్చింది. ఆగస్టు 25న రాజాసింగ్‌పై పీడీయాక్ట్ నమోదు చేసి మళ్లీ అరెస్ట్ చేశారు. ఆ తరువాత విడుదలై బయటకు వచ్చారు.




