భారతదేశ హరిత విప్లవ పితామహుడని పేరొందిన ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ సెప్టెంబర్ 28 గురువారం ఉదయం చెన్నైలోని స్వగృహంలో 11.20 నిముషాలకు కన్నుమూశారు.. అధిక దిగుబడినిచ్చే గోధుమలు మరియు వరి రకాలను పరిచయం చేయడం, మరింత అభివృద్ధి చేయడంవ్లన భారతదేశంలో హరిత విప్లవానికి ప్రధాన రూపశిల్పిగా ఖ్యాతినొందారు. పంటల దిగుబడి పెంచడమే లక్ష్యంగా స్వామినాథన్ కొన్ని ప్రయోగాలు, పరిశోధనలూ చేసి.. సరికొత్త వంగడాలను సృష్టించి.. వ్యవసాయ విధానాల్లో చాలా మార్పులు చెయ్యడంతో… భారతదేశ వ్యవసాయ ముఖచిత్రం మారిపోయింది. దాంతో… దిగుబడి బాగా పెరిగింది.
అధిక దిగుబడినిచ్చే గోధుమలు మరియు వరి రకాలను పరిచయం చేయడం, మరింత అభివృద్ధి చేయడంవ్లన భారతదేశంలో హరిత విప్లవానికి ప్రధాన రూపశిల్పిగా ఖ్యాతినొందారు. పంటల దిగుబడి పెంచడమే లక్ష్యంగా స్వామినాథన్ కొన్ని ప్రయోగాలు, పరిశోధనలూ చేసి.. సరికొత్త వంగడాలను సృష్టించి.. వ్యవసాయ విధానాల్లో చాలా మార్పులు చెయ్యడంతో… భారతదేశ వ్యవసాయ ముఖచిత్రం మారిపోయింది. దాంతో… దిగుబడి బాగా పెరిగింది.
స్వామినాథన్ డా.ఎం.కె.సాంబశివన్, పార్వతి దంపతులకు రెండవ కుమారుడు. 1925 ఆగష్టు 7 న తమిళనాడులో కుంభకోణంలో జన్మించారు. స్వామినాథన్ తండ్రి ఆయన తన 11వ యేట మరణించగా భాద్యతలను వారి మేనమామ ఎం.కె.నారాయణస్వామి (రేడియాలజిస్టు) చేపట్టారు. స్వామినాథన్ ప్రారంభ విద్య స్థానిక పాఠశాలలో సాగగా తరువాత కుంభకోణంలోని కాథలిక్ లిటిల్ ఫ్లవర్ హైస్కూలు మెట్రిక్యులేషన్ పూర్తిచేసారు. వైద్యుల కుటుంబ నేపథ్యంలో ఆయన మొదట వైద్య విద్యలో కాలుపెట్టి, 1943 నాటి భయంకరమైన బెంగాల్ కరువును చూసి, మహాత్మా గాంధీ వలన ప్రభావితుడై, భారతదేశంలో ఆకలి తొలగించాలని కంకణం కట్టుకుని జీవితాన్ని వ్యవసాయ రంగానికి అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు.
అయన వైద్యరంగం నుండి వ్యవసాయ రంగానికి మళ్ళారు. కేరళ, త్రివేండ్రం లోని మహారాజా కళాశాలలో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పూర్తిచేసి, ఆ కళాశాలలో 1940 నుండి 44 వరకు చదివి జంతుశాస్త్రంలో బి.యస్సీ డిగ్రీ సాధించారు. హెచ్.హెచ్.ఎం. విశ్వవిద్యాలయం, తిరువనంతపురం, మద్రాసు విశ్వవిద్యాలయం, తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఫిట్జ్‌విల్లం కళాశాల, కేంబ్రిడ్జ్, యూనివర్శిటీ ఆఫ్హ్ విస్కోసిన్ – మాడిసన్ లలో ఆయన విద్యార్థిగా రికార్డు నెలకొల్పారు పంటల దిగుబడి పెంచడమే లక్ష్యంగా స్వామినాథన్ కొన్ని ప్రయోగాలు, పరిశోధనలూ చేసి.. సరికొత్త వంగడాలను సృష్టించి.. వ్యవసాయ విధానాల్లో చాలా మార్పులు చెయ్యడంతో… భారతదేశ వ్యవసాయ ముఖచిత్రం మారిపోయింది. దాంతో… దిగుబడి బాగా పెరిగింది.
వైద్యవృత్తిలోని ఆయన తండ్రి మహాత్మాగాంధీ అనుచరుడు. స్వదేశీ ఉద్యమం భారతీయులు విదేశీ దిగుమతులపై ఆధారపడకుండా, గ్రామీణ పరిశ్రమను కాపాడడటం అనే ప్రయోజనంతో రూపొందించిన ఉద్యమంలొ భాగంగా విదేశీ వస్తువుల బహిష్కరణ సందర్భంగా కుంభకోణంలో విదేశీ దుస్తులను దగ్దం చేసారు. సాంబశివన్ తమిళనాడులో భారత స్వాతంత్య్రోద్యమంలో భాగంగా జరిగిన దేవాలయ ప్రవేశ ఉద్యమంలో దళితుల ఆలయ ప్రవేశ కార్యక్రమానికి నాయకత్వం వహించిన ఘనులు. ఫైలేరియాసిస్ భయంకర వ్యాధితో బాధపడుతున్న కుంభకోణం ప్రాంతంలో ఆ వ్యాధిని నిర్మూలించడానికి ఆయన కృషిచేసారు. ‘‘మన మనస్సులో ‘అసాధ్యం’ అనే మాట సాధారణంగా వస్తుంది. దానికి ధృఢ సంకల్పంతో కృషిచేసిన తరువాత గొప్పపనులు సాధించవచ్చు.’’ అనే విషయాన్ని తండ్రి నుంచి నేర్చుకున్నారు. తండ్రి చేస్తున్న కార్యక్రమాల ప్రభావంతో బాల్యంలో స్వామినాథన్ కు సేవాభావన కలిగింది.
1972 నుండి 1979 వరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సంస్థకు జనరల్ డైరక్టరుగా, 1979 నుండి 1980 వరకు భారతదేశ వ్యవసాయ మంత్రిత్వశాఖకు ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించారు. అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ కు 1982 నుండి 1988 వరకు డైరక్టరుజనరల్ గా తన సేవలనందించారు. 1988లో ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రీసోర్స్ సంస్థకు అధ్యక్షునిగా వ్యవహరించారు. 1999లో 20వ శతాబ్దంలో అత్యధికంగా ప్రభావితం చేసిన ఆసియా ప్రజల జాబితా ‘‘టైం 20’’ లో టైమ్ మ్యాగజైన్ ఆయన పేరు ప్రచురించింది. వృత్తిపరమైన జీవితం 1949 నుండి ప్రారంభమై 65 సంవత్సరాల సుదీర్ఘ కాలం వ్యవసాయ (హరిత)విప్లవానికి ప్రాణం పోసారు.
డాక్టర్ ఎం. ఎస్. స్వామినాథన్ ‘హరిత విప్లవం’ విజయం కోసం ఇద్దరు కేంద్ర వ్యవసాయ మంత్రులు సి. సుబ్రమణ్యం (1964-67), జగ్జీవన్ రామ్ (1967-70 %•% 1974-77)తో కలిసి పనిచేశారు. ఈ కార్యక్రమం క్వాంటం జంప్‌కు మార్గం సుగమం చేసింది. రసాయన-జీవ సాంకేతికత అనుసరణ ద్వారా గోధుమ, బియ్యం ఉత్పాదకత, ఉత్పత్తిని పెంచింది. గోధుమలపై ప్రముఖ అమెరికన్ వ్యవసాయ శాస్త్రవేత్త, 1970 నోబెల్ గ్రహీత నార్మన్ బౌర్లాగ్ ఆవిష్కరణ ఈ విషయంలో కీలక పాత్ర పోషించిందని చెప్పొచ్చు.
1951లో కేంబ్రిడ్జ్ లో చదివినప్పుడు పరిచయమయిన మీనాను వివాహమాడారు. చివరివరకూ చెన్నైలో నివసించారు. వారికి ముగ్గురు కుమార్తెలు, ఐదుగురు మనుమలు ఉన్నారు. వారి పెద్ద కుమార్తె డా.సౌమ్యా స్వామినాథన్ ప్రపంచ ఆరోగ్య సంస్థకు డిప్యూటీ డైరక్టరు జనరల్ గా, రెండవ కుమార్తె డా. మధుర స్వామినాథన్ బెంగళూరులోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్ లో ఆర్థిక శాస్త్రంలో అధ్యాపకురాలిగా, మూడవ కుమార్తె నిత్యా స్వామినాథన్ ఉత్తర అంగోలియా విశ్వవిద్యాలయంలో సీనియర్ అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు.
భారతదేశంలో గోధుమ,బియ్యం అధిక-దిగుబడి రకాలపై ఆయన పరిశోధనలు కృషి అమోఘం. ఆయన ప్రతిభా విశేషాలకు పురస్కారాలా వరదలో మునిగిపోయారు. పద్మశ్రీ (1967), రామన్ మెగసెసే (1971),పద్మభూషణ్ (1972), ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వరల్డ్ అవార్డ్ ఆఫ్ సైన్స్ (1986), పద్మవిభూషణ(1989), వరల్డ్ ఫుడ్ ప్రైజ్ (1987), టైలర్ ప్రైజ్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ అఛీవ్‌మెంటు (1991) వోల్వో ఎన్వినాన్‌మెంటల్ ప్రైజ్(1999), ఇందిరా గాంధీ శాంతి బహుమతి(1999) వాటిలో కొన్ని. మానవుల ఆకలికి కళ్ళెం వేసిన అపర సృష్ఠికర్త స్వామినాథన్ కు దేశం ఎంతగానో ఋణపడి ఉంది. భారత దేశానికి ఓ శాస్త్రవేత్తగా, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్‌గా స్వామినాథన్ ఎనలేని సేవలు అందించారు. ఆయన సేవలను భారత్ ఎప్పటికీ గుర్తుంచుకోవాలి.
సీనియర్ జర్నలిస్ట్ 98481 28215




