హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

పటాన్ చెరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 10: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన తొమ్మిదో విడత హరితహారంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై విజయవంతం చేయాలని మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి కోరారు. గురువారం మున్సిపల్ పరిధిలోని 20వ వార్డు సాయి భగవాన్ కాలనీ, 13వ వార్డు బసవేశ్వర కాలనీలలో స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రజలకు మున్సిపల్ చైర్మన్ టిపిఆర్ మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత తొమ్మిది సంవత్సరాలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో హరితహారం కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించడంతోపాటు.. ఖాళీ స్థలాలు పచ్చదనం పెంపొందించేందుకు మొక్కలు పెంచాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ వ్యాప్తంగా ప్రతి కాలనీలో హరితహారం కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్ జ్యోతి రెడ్డి, కౌన్సిలర్లు కృష్ణ, బోయిని బాలరాజు, లావణ్య శశిధర్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, కోఆప్షన్స్ సభ్యులు యునుస్, తదిదారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *