హన్మంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లోకి చేరికలు

కుత్బుల్లాపూర్, ప్రజాతంత్ర, నవంబర్ 14 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మున్సిపాలిటీ పరిధిలోని దుందిగల్ గ్రామంలో ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో వారి మిత్రమండలి మంగళవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొలన్ హన్మంత్ రెడ్డి సమక్షంలో 1000 మంది మహిళలు, యువకులు పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా కొలన్ హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ  కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వారి సమస్యలు అన్నింటినీ తాను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలను గురించి వివరించి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తమ శాయశక్తులా పని చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సెక్రటరీ నర్సారెడ్డి భూపతి రెడ్డి, కె పి విశాల్ గౌడ్, బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి, మైసిగారి శ్రీనివాస్, కుమార్ యాదవ్, సాదు యాదవ్, బొంగునూరి కిశోర్ రెడ్డి, నవీన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,  కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *