ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 25 : ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రబిక్య తండా, నుచ్చుగుట్ట తండాలలో సోమవారం హనుమాన్ స్వాములు నిర్వహించిన హనుమాన్ ఇరుముడి పూజా కార్యక్రమాలలో మున్సిపల్ చైర్మన్ నేనావత్ రాంపాల్ నాయక్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయాల్లో అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలలో హనుమాన్ స్వాములు, నంగ్రి నాయక్, హనుమ నాయక్, రమేష్ నాయక్, రవి నాయక్, కిరణ్ నాయక్, రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
హనుమాన్ ఇరుముడి పూజలో పాల్గొన్న మున్సిపాలిటీ చైర్మన్



