హక్కుల సాధన కోసం ముదిరాజ్‌లంతా ఏకతాటిపైకి

పటాన్‌ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 5: రాష్ట్రంలోని ముదిరాజులు అందరూఒకేతాటిపైకి వచ్చి తమ హక్కులకోసం పోరాటం  చేస్తున్నారని  ఎన్‌ఎంఆర్‌ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు నీలం మధు ముదిరాజ్‌ అన్నారు.గురువారం చేవెళ్లలో పండగసాయన్న విగ్రహావిష్కరణకు స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య, సంగారెడ్డి నియోజకవర్గ బిజెపి నాయకులు పులిమామిడి రాజు, కాసాని వీరేష్‌, బిత్తిరి సత్తి, దగడ్‌ సాయితో కలిసి హాజరైన నీలం మధు ముదిరాజ్‌కు ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వాహకులు నీలం మధు ముదిరాజ్‌ను ఘనంగా సత్కరించారు.

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ముదిరాజ్‌లు రాజ్యాధికారం కోసం ఏకమై పోరాటానికి సిద్ధం అవుతున్నారని తెలిపారు. పార్టీలు గుర్తించకపోవడంతో నష్టపోయే అవకాశం ఉందని తెలిపారు. జనాభా ప్రాతిపదికన ముదిరాజ్‌లకు అన్ని పార్టీలు టికెట్లు కేటాయించాలని ఆయన డిమాండ్‌ చేశారు.  లేని పక్షంలో స్వతంత్రంగా పోటీకి దిగి వారి బలాన్ని నిరూపించుకుంటామని హెచ్చరించారు, స్థానిక ప్రజాప్రతినిధులు, సంఘం పెద్దలు, ఎన్‌ఎంఆర్‌ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *