హంగు ఆర్భాటంతో నామినేషన్ దాఖలు చేసిన మల్రెడ్డి రంగారెడ్డి

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,నవంబర్ 9: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి గురువారం ఆర్డీఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ఇబ్రహీంపట్నంలో ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఓటమి భయంతో తమ నాయకులపై,కార్యకర్తలపై రాళ్లదాడులకు పూనుకున్నారని ఆయన ఆరోపించారు.ప్రజాస్వామ్యంలో రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప ఇలాంటి దాడులకు పాల్పడడం హెయమైనా చర్యగా ఆయన అభివర్ణించారు.ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ప్రజా సేవకునిగా పేరు తెచ్చుకోవాలని గుండా గిరి చేసి భయాందోళనలకు గురి చేస్తే ఎవరూ భయపడే లేదని ఆయన స్పష్టం చేశారు. తిరిగి ఇలాంటి దాడులు జరిగితే తాము కూడా దారులకు దిగవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు.బిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్న నేపద్యంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి అతని తనయుడు ప్రశాంత్ రెడ్డి దాడులకు దిగటం దారుణం అన్నారు.నామినేషన్ ప్రక్రియలో భాగంగా మల్రెడ్డి రంగారెడ్డికి నాయకులు,కార్యకర్తలు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని మద్దతు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *