ముంబై, డిసెంబర్ 20 : పెరిగినప్పుడు వేలల్లో..తగ్గినప్పుడు వందల్లో అన్నది బంగారానికి బాగా సరిపోతుంది. గత మూడేళ్లుగా ఇలా ఎంతగా పెరిగిందంటే 50వేలకు తులం చేరేంతగా పెరిగింది. తాజాగా బంగారం ధర కాస్త దిగి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్ ధరల ప్రభావమో మరోకటో కానీ పసిడి ధర స్వల్పంగా మాత్రమే తగ్గుతోంది. సోమవారం స్థిరంగా ఉన్న బంగారం ధర మంగళవారం మాత్రం కాస్త తగ్గింది.
10 గ్రాముల బంగారంపై రూ.380 వరకు తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు)పై రూ.350 మేర తగ్గింది. నేడు 22 క్యారెట్ల ధర రూ.49,600కు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధరపై రూ.380 తగ్గి రూ.54,110కి చేరుకుంది. వెండి కిలోపై రూ.200 మేర తగ్గింది. దేశంలో వెండి ధర రూ.69,500కు చేరుకుంది.



