- యుద్ధభూమిగా మారిన శాసన వ్యవస్థలు
- తరగతి గదికే పరిమితం కావద్దు
- చైతన్య విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో
- మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు యువతకు పిలుపు
సుబేదారి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4: భారతదేశ రాజకీయాలలో పెరిగి పోయిన అవినీతి అక్రమాలు, బందు ప్రీతిని నిర్మూలించేందుకు, స్వచ్ఛమైన రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. శనివారం హనుమకొండలోని చైతన్య విశ్వవిద్యాలయం 11వ స్నాతకోత్సవ కార్యక్రమానికి విశ్వవిద్యాలయం ఛాన్స్లర్ డాక్టర్ పురుషోత్తం రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో వెంకయ్య నాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొని స్నాతకోత్సవ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ రాజకీయాలలో అక్రమాలు అవినీతి పెరిగిపోయిందని శాసనసభలు, పార్లమెంటు సమావేశాలలో చర్చ జరగడం లేదని కేవలం యుద్ధభూమిగా మారిపోయాయన్నారు. అధికార పార్టీ ప్రతిపక్షాలకు గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. నీతివంతమైన రాజకీయ వ్యవస్థను పునరుద్ధరించాలంటే యువత రాజకీయ రంగ ప్రవేశం చేయాలన్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో బ్యాలెట్‌కు చాలా విలువ ఉందని, బుల్లెట్ కు విలువ లేదని ఆయన అభిప్రాయపడ్డారు. సమాజంలో విద్యార్థులను భాగస్వాములు చేయాలని, బోధన కేవలం తరగతి గదికే పరిమితం కాకుండా సగం తరగతి గదిలో సగం క్రీడా మైదానంలో, సగం సమాజంలో గడపాలని అప్పుడే విద్యార్థికి సమాజం పట్ల అవగాహన పెంపొందుతుందని ఆయన అన్నారు. యోగ ప్రస్తుతం 172 దేశాలలో యోగ ఇస్ నాట్ మోడీ ‘‘యోగ ఇస్ ద బాడీ డెవలప్మెంట్’’ అని వెంకయ్య నాయుడు అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని, మన పూర్వీకులు అనుసరించిన ప్రాచీన విధానాన్ని అలవర్చుకోవాలని ఉదయాన్నే లేవాలని, సెల్‌ఫోన్ ఎక్కువగా వాడకుండా ఉండాలని ,ప్రతి ఇంట్లో క్రమ పద్ధతిగా టీవీ ని ఉపయోగించాలని ,భోజన సమయం త్వరగా ఉండే విధంగా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను అనుసరించాలని ఆయన అన్నారు విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం కోసం నిరంతరం అధ్యయనం చేయాలన్నారు. ప్రాచీన కాలం నుండి అనుసరిస్తున్న సాంప్రదాయక భోజన విధానాన్ని కొనసాగించాలని ప్రస్తుతం యువత ఇనిస్టెంట్ భోజనానికి అలవాటు పడుతున్నారని అది కాన్స్టంట్ భోజనం అవుతుందని, విటమిన్స్ తో కూడుకున్న పౌష్టిక ఆహారాన్ని భుజించాలని, వరి అన్నంతో ఎక్కువ శాతం చక్కర వ్యాధికి గురవుతున్నారని, చిరుధాన్యాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం ఎంతో శ్రేయస్కరమని, ప్రతి యువత శ్రమకు అలవాటు పడాలని శ్రమ లేకపోతే ఆరోగ్యంగా ఉండలేరని ఆరోగ్యం గలిగిన యువత దేశానికి ఎంతైనా అవసరమని ఆయన అన్నారు. ప్రాత్యత్యా భోజనానికి, విధానానికి అలవాటు పడకుండా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ఉట్టిపడే విధానాలకు యువత అలవాటు పడాలని ఆయన అన్నారు.
ప్రతి విద్యార్థి సానబట్టిన వజ్రం లాగా ఎదగాలన్నారు. వజ్రం సాన పట్టకపోతే విలువ లేదని, భూమి ఎంత సారవంతమైనది అయినా దున్నకపోతే విలువ లేదని, ఎంత తెలివిగల వ్యక్తి అయిన విద్యనిరువకపోతే విలువ లేదన్నారు. ప్రస్తుతం సమాజంలో శాస్త్ర, సాంకేతిక బాగా అభివృద్ధి చెందిందని దీనిని ఉపయోగించుకుంటూ అమ్మ భాషకు ప్రాధాన్యత ఇవ్వాలని దేశంలో ప్రాంతీయ భాషలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలని తెలుగు భాష కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పరిపాలన రంగాలలో ప్రాంతీయ భాషా (తెలుగు భాషకు) విలువ ఇవ్వాలని కలెక్టర్లు ఇతర అధికారులు ప్రాంతీయ భాషలోనే మాట్లాడాలని అధికార బటువాడ జరగాలన్నారు. తెలియని
భాషను నెత్తిన పెట్టుకోవద్దని తెలిసిన భాషలో అధికార యంత్రాంగం పనిచేయాలని, సమాజంలో భారతమ్మ భేదాలు ఉండకూడదన్నారు కులం మతం పేరుతో కొన్ని రాజకీయ శక్తులు పనిచేస్తున్నాయని అది దేశ శ్రేయస్ కొరకు విఘాతం కలిగిస్తాయని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు.
విద్య వ్యాపారం కాకూడదని విద్యను కేవలం విలువలతో కూడిన విద్యగా అందించుటకు విద్యాసంస్థలు పనిచేయాలన్నారు. ఇక్కడి విద్యార్థులు ఇతర దేశాలకు వెళ్లి అక్కడ ఇల్లు కొనుక్కున్నామని, కారు కొనుక్కున్నామని భారతదేశంలో ఉన్న తాతయ్యకు అమ్మమ్మకు ఫోటోలు పెట్టడం మంచిది కాదన్నారు, నీవు భారతదేశానికి వచ్చి సమాజంలో సేవ చేయుటకు అంకితం కావాలన్నారు. అప్పుడే నీవు నిజమైన భారతీయుడుగా గుర్తింపు పొందుతావని పేర్కొన్నారు. ఈ ప్రపంచం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ఎంతో ఎదుగుతుందని అయితే పర్యావరణాన్ని కూడా కాపాడాలని యువత పర్యావరణ పరిరక్షణకు నిరంతరం పాటుపడాలన్నారు, అనుకోని సమయాలలో వర్షాలు కురవడం, ఉదాహరణకు అమెరికా తీసుకుంటే ఎంతో అభివృద్ధి చెందిన దేశమైనప్పటికీ అక్కడ పర్యావరణ పరిరక్షణ లేకపోవడం అక్కడ విపత్తులు సంభవిస్తున్నాయని. కానీ భారతదేశ 365 రోజులు ఎండ కొడుతుందని మన దగ్గర ఉన్న వనర్లు, పర్యావరణ సానుకూలత మరి ఎక్కడ దొరకవని ఆయన అన్నారు.
భారత దేశంలో ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఉందని, చరిత్ర వర్తమానానికి మార్గదర్శకంగా ఉండాలని, గతంలోని చరిత్ర బ్రిటిష్ వారి ప్రాబల్యంతో రాయబడిందన్నారు జన్మభూమిని, మాతృభాషను విడనాడ వద్దని వెంకయ్య నాయుడు యువతకు ఉద్బోధించారు. ఈ ప్రాచీన కాలం నుండి భారతదేశంలో బోధన సంస్థలుగా తక్షశిల, నలంద విశ్వ గిరి నాగరిక సమాజానికి ఎంతగానో దోహదపడ్డాయని, వేదాలు ఉపనిషత్తులు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించే విధంగా ఉన్నాయన్నారు. ప్రపంచంలో భారతదేశం అతిపెద్ద ఐదవ ఆర్థిక వ్యవస్థగా వెలుగొందిందని రానున్న రోజులలో అతిపెద్ద మూడవ ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఎదుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తి పై ఉందని, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత అభివృద్ధి సాధించిందో ఒకసారి గమనించాలని, దేశ అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న సైన్స్ అండ్ టెక్నాలజీ అన్ని రంగాలలో ఉపయోగించుకొని దేశం పురోగతి సాధిస్తుందని వెంకయ్య నాయుడు అన్నారు.
కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు దేశం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలంటే యువత పాత్ర చాలా కీలకమని ఆరోగ్యవంతమైన యువతను కలిగి ఉండాలంటే క్రమశిక్షణతో కూడిన యువత దేశ అవినీతి రైత రాజకీయాలను నెలకొల్పుటకు ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో కులపతి పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ చైతన్య విశ్వవిద్యాలయం విద్య ఉద్యోగ రంగాలలో ఎంతో పురోభివృద్ధి సాధించిందని రానున్న రోజులలో మరింత అభివృద్ధి సాధించుటకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తుందని ఆయన అన్నారు, ఈ కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య దామోదర్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయం విద్యా ప్రణాళికలు, పరిశోధన, క్రీడలు, ఎన్సిసి ఎన్ఎస్ఎస్, సామాజిక సేవ, సాంస్కృతిక కార్యక్రమాలు, బోధన విధానం పేర్కొన్నారు. ఈ స్నాతకుత్వ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా ఎన్ఐటి సంచాలకులు ఆచార్య రమణారావు, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి ప్రసంగించారు. అనంతరం ఉపరాష్ట్రపతి డిగ్రీ పీజీ స్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు బంగారు పథకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు బోధన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



