స్పెషల్‌ డ్రైవ్‌తో ధరణి భూసమస్యలు కొలిక్కి..

ఆరు రోజుల్లో 76 వేల దరఖాస్తుల పరిష్కారం
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి వెల్లడి

 
image.png

హైదారాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 7 : గత ప్రభుత్వం ఎంతో హడావిడిగా ఎలాంటి ఆధ్యయనం చేయకుండా తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ వల్ల ఉత్పన్నమైన సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఏదో ఒక కుటుంబం ధరణితో సమస్యలను ఎదుర్కుంటుందని, ఈ సమస్యలను పరిష్కరించడానికి తమ ప్రభుత్వం చిత్త శుద్ధితో పనిచేస్తుందని ఆయన తెలిపారు. ధరణికి సంబంధించి గత ప్రభుత్వంలో వొచ్చిన 2,46,536 లక్షల దరఖాస్తులు పెండిరగ్‌లో ఉన్నాయని, వీటి పరిష్కారానికి ఈ నెల 1వ తేది నుండి ఎమార్వో స్థాయిలో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నామని, ఈ స్పెషల్‌ డ్రైవ్‌ లో 7వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్‌, ఆర్డీఓ, తహశీల్దార్‌ స్థాయిలో 76,382 ధరఖాస్తులను పరిష్కరించడం జరిగిందని గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మంత్రి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు.

రోజుకు 15 వేలకు పైగా ధరఖాస్తులను పరిష్కరిస్తున్నామని తెలిపారు. ప్రధానంగా పెండిరగ్‌ మ్యూటేషన్‌కు సంబంధించి 15,070 దరఖాస్తులకు  5,471 పరిష్కరించడం జరిగిందని, గ్రీవెన్స్‌ ఆఫ్‌ ల్యాండ్‌ మ్యాటర్‌ 40,605  దరఖాస్తులకు గాను 17,372బీ పాస్‌ బుక్‌ డేటా కలెక్షన్‌కు సంబంధించి  1,01,132 దరఖాస్తులకు గాను 27,047 పరిష్కరించడం జరిగిందని, కోర్టు కేసులకు సంబంధించి 27,672 దరఖాస్తులకు గాను 9,883 పరిష్కరించడం జరిగిందని వివరించారు.
రెవెన్యూ  సిబ్బంది కి అభినందనలు
ఇప్పటివరకు జరిగిన ప్రక్రియలో రెవెన్యూ యంత్రాంగం క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో పనిచేసి దీర్ఘకాలంగా అపరిష్కృతంగా..పెండిరగ్‌లో ఉన్న భూసమస్యలను అధికారులు, సిబ్బంది పరిష్కరించడం పట్ల మంత్రి వారికి అభినందనలు తెలిపారు. రానున్న రోజుల్లో కూడా ఇదే స్పూర్తిని కొనసాగించాలని మంత్రి అభిలషించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *