స్నేహితుడి కుటుంబానికి లయన్స్ క్లబ్ సభ్యుల చేయూత

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్టు 4 : స్నేహితుని కుటుంబానికి ఆమనగల్లు లయన్స్ క్లబ్ సభ్యులు చేయూతనందించారు. వివరాల్లోకి వెళితే 1983 -84 జడ్పిహెచ్ఎస్ ఆమనగల్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుకున్న ఆకుల రమేష్ గత సంవత్సరం మృతి చెందారు. రమేష్ స్నేహితులు వీర బొమ్మ బిక్షపతి, శ్రీనివాస్, వెంకట్, ఎండి కాజా,  విష్ణువర్ధన్ రెడ్డి, మాణిక్ రావు తదితరుల సహకారంతో మృతుడు ఆకుల రమేష్ కూతురుకు  లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమనగల్ ఆధ్వర్యంలో రూ. 50 వేల ఆర్థిక సహాయాన్ని కూతురు ఆకుల భాను రేఖ చదువు నిమిత్తం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆమనగల్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు యాచారం వెంకటేశ్వర్లు, ఫాస్ట్ క్యాబినెట్ ట్రెజరర్ ఓంకారం, మిట్టపల్లి అంజయ్య, పాస్ట్ ప్రెసిడెంట్  సత్యనారాయణ, జై రమేష్, పాస్ట్ జోన్ చైర్మన్ కె. రామ్ రెడ్డి, ఫాస్ట్ ప్రెసిడెంట్ లింగయ్య, అర్థం మనోహర్, సభ్యులు కేశవులు, మదన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *