సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 20: తెలంగాణ శాసనసభ సాధారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ హుస్నాబాద్-32, సిద్దిపేట-33 నియోజకవర్గాల జనరల్ అబ్జర్వర్ జయ శ్రీ ఎస్.భోజ్ (ఐఎఎస్), దుబ్బాక-41, గజ్వేల్-42 నియోజకవర్గాల జనరల్ అబ్జర్వర్ మన్మోహన్ ప్రసాద్ (ఐఎఎస్), అబ్జర్వర్ లతో కలిసి సిద్దిపేట పట్టణం పొన్నాల శివారులో గల ఇందూరు కళాశాలలో జిల్లాలోని 4నియోజకవర్గాలకు సంబంధించి ఏర్పాటు చేస్తున్న స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ సెంటర్లను పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించి రిసెప్షన్, స్ట్రాంగ్ రూమ్ ఓట్ల లెక్కింపునకు డి బ్లాక్ ను, హుస్నాబాద్ నియోజకవర్గ స్ట్రాంగ్ రూమ్ ఓట్ల లెక్కింపునకు సి బ్లాక్, గజ్వేల్ నియోజకవర్గం స్ట్రాంగ్ రూమ్ ఓట్ల లెక్కింపునకు ఇ బ్లాక్, దుబ్బాక నియోజకవర్గం స్ట్రాంగ్ రూమ్ ఓట్ల లెక్కింపునకు ఏ బ్లాక్ లను పరిశీలించి ప్రక్రియకు అనుగుణంగా ఆయా బ్లాక్ లను సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ అబ్జర్వర్లకూ తెలిపారు. స్ట్రాంగ్ రూంలో ఈవీఎం మిషిన్లు ఉంచడానికి ఐరన్ ర్యాక్ లు ఈసిఐ మార్గదర్శకాల ప్రకారం స్ట్రాంగ్ రూం ను తయారీ 24/7 స్ట్రాంగ్ చుట్టూ కవర్ అయ్యే విధంగా సిసి కెమెరాల ఏర్పాటు, కౌంటింగ్ సెంటర్ లో ఓట్ల లెక్కింపు నకు ఫర్నిచర్ లతో కూడిన కౌంటర్ల ఏర్పాటు చెయ్యాలని ఏజెన్సీకి తెలిపారు. నియోజకవర్గ స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు బాధ్యతలు పూర్తిగా నియోజకవర్గ రిటర్నింగ్ అదికారిది మాత్రమే. ఆర్వోలు ప్రతిరోజు కళాశాలలో పనులు పూర్తయ్యే వరకు పర్యవేక్షీంచాలని తెలిపారు. ప్రతి బ్లాక్ ముందు కౌంటర్ల ఏర్పాటు, కౌంటర్ల నుండి కేంద్రాలకు కాలినడకన వెళ్ళే మార్గాలలో గ్రీన్ కార్పెట్ వెయ్యాలి. అదేవిధంగా ఎన్నికల సామాగ్రితో వచ్చే వాహనాలు వచ్చే మార్గాలు పార్కింగ్ చేసేందుకు బ్లాకుల వారీగా మైదానంలో చదును చేసి నియోజకవర్గం వారిగా వచ్చే మార్గాలు, పార్కింగ్ ప్రాంతంలో బాంబో బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఎజెన్సీ కి తెలిపారు. పోలింగ్ రోజు పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఇందూర్ కళాశాలకు ఈవీఎంలు మిషిన్లు చేర్చి స్ట్రాంగ్ రూంలో భద్రపరిచే వరకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ లకు సైతం ఓట్ల లెక్కింపు వరకు 24 / 7 బందోబస్తు ఏర్పాటు చేయాలి. ఓట్ల లెక్కింపు రోజు అనుసరించాల్సిన వివిధ ప్రక్రియ గురించి ఆర్వో, పోలీస్ అధికారులకు వివరించారు. ఓట్ల లెక్కింపు రోజు మైదానంలో మీడియా పాయింట్ ఏర్పాటు భాద్యతలను చూసుకోవాల్సిందిగా డిపిఆర్ఓ రవికుమార్ కు తెలిపారు. మీడియా పాయింట్ కు కావలసిన అన్ని సదుపాయాలు ప్రతిదీ సమకూరుస్తామని కలెక్టర్ తెలిపారు. నియోజకవర్గం లోని పోలీంగ్ స్టేషన్ నుండి ఈవీఎం మెషిన్లను బస్సులలో సెక్టర్ అధికారులు పోలీస్ ఎస్కార్ట్ తో ఇందూరు కళాశాలకు తీసుకొచ్చేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని రిటర్నింగ్ అధికారులు, పోలీస్ అధికారులకు తెలిపారు.అంతకుముందు రాజీవ్ రహదారి నాగులబండ సమీపంలో ఏర్పాటుచేసిన ఎస్ ఎస్ టి- పొన్నాల సెంటర్ పరిశీలించారు.తప్పనిసరిగా ప్రతి వాహనాన్ని చెక్ చేశాకే పంపించాలని అలాగే రిజిస్టర్ లో సంతకం చేశారు.రాజీవ్ రహదారి నుండి పొన్నాల గ్రామంలోకి వెళ్లే మార్గంలో బ్రిడ్జి పనులు వేగంగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్ ఈఈ కి తెలిపారు.వీరి వెంట కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్వేత, ఆర్వోలు – గరిమ అగ్రవాల్, రమేష్ బాబు, బన్సీలాల్, బెన్ షాలం, ఏసీపీలు – చంద్రశేఖర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, సతీష్ కుమార్ రమేష్, ఏఆర్వోలు తదితరులు ఉన్నారు.
స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ సెంటర్ల పనులను క్షేత్రస్థాయిలో పరిశీలన





