స్కూల్‌ ‌సంక్రాతి సెలవుల్లో మార్పులు

అమరావతి,జనవరి7: సంక్రాంతి సెలవులపై ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. పాఠశాలలకు సెలవుల్లో పలు మార్పులు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మొదట విడుదల చేసిన షెడ్యూల్లో మార్పు చేసింది. మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ‌ప్రకారం జనవరి11 నుంచి 16వరకు సెలవులు ఉండగా సవరించిన ఉత్తర్వు ప్రకారం వీటిని 12నుంచి 17వ తేదీ వరకు మార్పు చేశారు.

ఈ మేరకు ఏపీ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. 17న ముక్కనుమ ఉన్నందున సెలవు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాల నుంచి వినతులు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 18 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమ వుతాయని విద్యాశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.సవరించిన షెడ్యూల్‌ ‌జాబితాను అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు పంపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *