షాద్ నగర్ లో ది అడ్వకేట్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సొసైటీ బ్రాంచ్ ప్రారంభం
షాద్ నగర్, ప్రజా తంత్ర జూలై 24 : రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో న్యాయవాదుల బాగోగుల కోసం అన్ని విధాల సహకరించేందుకు నూతనంగా ది అడ్వకేట్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సొసైటీ బ్రాంచ్ ప్రారంబించడం సంతోషంగా ఉందని రంగారెడ్డి అడిషనల్ డిస్టిక్ట్ అండ్ సేషన్ జడ్జ్ (ఎడిజే) వై. జయ ప్రసాద్ అన్నారు. షాద్ నగర్ కోర్టు సముదాయంలో నూతనంగా సోమవారం స్థానిక బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వేణుగోపాల్ రావు ఆధ్వర్యంలో అడ్వకేట్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ సొసైటీ బ్రాంచ్ ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో షాద్ నగర్ సేషన్ సివిల్ జడ్జ్ సిఎం రాజ్యలక్ష్మి, జూనియర్ సివిల్ జడ్జి సూరజ్ సింగ్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ ధీరజ్ కుమార్, జిల్లా సొసైటీ అధ్యక్షులు రాజీవ్ రెడ్డి, ప్రభుత్వ లీడర్ కంచి రాజగోపాల్ తదితర స్థానిక న్యాయవాదులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్జ్ జయ ప్రసాద్ మాట్లాడుతూ.. కోపరేటివ్ సొసైటీ సేవలను అందరూ న్యాయవాదులు సకాలంలో వినియోగించుకోవాలని సూచించారు ఇది ఎంతో మంచి అవకాశం అని న్యాయవాదులకు కోఆపరేటివ్ సొసైటీ అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా చెప్పారు. షాద్ నగర్ సేషన్ సివిల్ జడ్జ్ సిఎం రాజ్యలక్ష్మి మాట్లాడుతూ.. కోఆపరేటివ్ సొసైటీ ద్వారా న్యాయవాదులకు అన్ని విధాల లాభం చేకూర్చుతుందని దేవాదులతో పాటు వారి కుటుంబాలకు కూడా ఎంతో ఈ సేవలు ఉపయోగపడతాయని ఆమె చెప్పారు. షాద్ నగర్ లో కోపరేటివ్ సొసైటీ బ్రాంచ్ ను ప్రారంభించుకోవడం పట్ల న్యాయవాదులకు శుభాభినందనలు తెలిపారు. స్థానికంగా న్యాయవాదులు ప్రజలకు ఎన్నో సేవలు చిత్తశుద్ధితో అందిస్తున్నారని ఈ సందర్భంగా ఆమె న్యాయవాద వృత్తి గురించి అభినందించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.




