పటాన్ చెరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 28: ప్రభుత్వ విద్యా సంస్థలో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు సొంత నిధులతో బస్సు పాసులు అందించి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.సోమవారం బిహెచ్ఎల్ టౌన్షిప్ లో గల జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాలలో చదువుతున్న 480 మంది విద్యార్థిని విద్యార్థులకు ఎమ్మెల్యే జిఎంఆర్ బస్సు పాసులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. ఉచితంగా పుస్తకాలు, యూనిఫామ్, మధ్యాహ్న భోజనం, తదితర సౌకర్యాలు ప్రభుత్వ విద్యా సంస్థల్లో అందుతున్నాయని తెలిపారు. గురుకుల పాఠశాలల్లో ప్రతి విద్యార్థి పై రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా 1,20,000 రూపాయలు ఖర్చు చేస్తుందని తెలిపారు. బిహెచ్ఎల్ తో పాటు పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని వివిధ పాఠశాలల్లోని విద్యార్థులకు సైతం ఉచితంగా బస్సు పాసులు అందిస్తున్నామని తెలిపారు.అనంతరం రామచంద్రపురం డివిజన్ పరిధిలోని రామచంద్రారెడ్డి నగర్ లో 60 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కాలనీలో గత 10 సంవత్సరాలుగా అపరిస్కృతంగా ఉన్న 33 కెవి లైన్ తరలింపు పనులను ప్రారంభించారు.భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఎల్ఐసి సొసైటీ కార్యాలయం ఆవరణలో 18 లక్షల రూపాయలకు నిరూపించిన నూతన గ్రంథాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. బిహెచ్ఇఎల్ టౌన్షిప్ లో గల శ్రీ అభిలాష ఒకేషనల్ సెంటర్ ను సందర్శించారు. వివిధ అంశాల్లో శిక్షణ పొందుతున్న దివ్యాంగులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సెంటర్లో కావలసిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు.విద్యా భారతి పాఠశాల నలిపిఓ వార్షికోత్సవంలో శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో నూతన నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, కార్పోరేటర్లు సింధు ఆదర్శ రెడ్డి, పుష్ప నగేష్, అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ కార్పొరేటర్ అంజయ్య, విద్యుత్ శాఖ డి ఈ రమేష్ చంద్ర, బిఆర్ఎస్ పార్టీ సర్కిల్ అధ్యక్షులు పరమేష్, సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




