సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 14: లోన్ యాప్ లాటరి పార్ట్ టైమ్ జాబ్, విదేశీ ప్రయాణం, తక్కువ పెట్టుబడి తో ఎక్కువ లాభం, పాన్ కార్డ్ అప్డేట్స్, ఆధార్ కార్డు లింక్, పేర్లతో సైబర్ మోసాలు, మెసేజ్ రాగానే ఆశపడి మోసపోకండి అప్రమత్తంగా ఉండండి.టోల్ ఫ్రీ నెంబర్ 1930 కు తక్షణమే కాల్ చేయండి.ఈ సంవత్సరం ఈ రోజు వరకు 1,03,66,472/- లక్షల రూపాయలు సీజ్ చేయడం జరిగింది.త్వరలో విడతలవారీగా సంబంధిత బాధితుల అకౌంట్ లో బ్యాంకుల ద్వారా జమవుతాయి.
సైబర్ నేరగాళ్లు ఆశ, భయం అనే రెండు అంశాల మీద సైబర్ నేరస్తులు సైబర్ నేరాలు చేస్తున్నారు.నకిలీ లాటరీలు,నకిలీ ఉద్యోగ ప్రకటనలు, నకిలీ బ్యాంకు అకౌంట్ సమాచారం నకిలీ గిఫ్టు బాక్సులు,లోన్ యాప్, పార్ట్ టైమ్ జాబ్, తక్కువ పెట్టుబడి తో ఎక్కువ లాభం, పింక్ వాట్సాప్ పేర్లతో సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారని వీటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.మన వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడు సామాజిక మాధ్యమాలలో పంచుకోకూడదు ఎందుకంటే సైబర్ నేరగాళ్లు ఇలాంటి అవకాశాల కోసం వేచి చూస్తారు కావున ఫోన్లు వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే 1930 కి కాల్ చేస్తే మీరు పోగొట్టుకున్న డబ్బులను తిరిగి పొందేలా చేయవచ్చు.3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక బాధితుడికి గుర్తుతెలియని సైబర్ నేరస్థుడు వాట్సప్ కు ఫైవ్ స్టార్, త్రీ స్టార్, హోటల్స్, రెస్టారెంట్లు రివ్యూ చేయాలని రివ్యూ కు డబ్బులు ఇస్తామని పార్ట్ టైం డబ్బులు సంపాదించవచ్చని మెసేజ్ పంపగానే అది నమ్మిన సదరు బాధితుడు అది నమ్మి హోటల్ పై రివ్యూ సైబర్ నేరస్తుడు కొన్ని డబ్బులు పంపించినాడు.యూట్యూబ్లో ట్రేడింగ్ సబ్స్క్రైబ్ చేసి డబ్బులు పెడితే ఎక్కువ మొత్తంలో లాభాలు వస్తాయని చెప్పగానే అది నమ్మిన బాధితుడు, మొదటగా 1000/- రూపాయలు పంపించాడు, గంటలోపే 1500 బాధితుడి అకౌంట్లో జమయ్యాయి, తదుపరి 3000 పంపించాడు, మరో గంటలోపు 4000 జమయ్యాయి, తదుపరి లక్ష రూపాయలు పంపించాడు, 1,50,000 జమయ్యాయి, తదుపరి 2 లక్షల పదివేల రూపాయలు పంపించాడు, రెండు లక్షల 80 వేల రూపాయలు జమయ్యాయి, ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తున్నాయని ఆశపడి సైబర్ నేరగాడు చెప్పిన విధంగా సదరు బాధితుడు 7 లక్షల రూపాయలు పంపించాడు, ట్రాన్జక్షన్ కరెక్టు లేదు మళ్లీ డబ్బులు పంపించాలని చెప్పగానే, అది నమ్మిన బాధితుడు 6,30,000/- రూపాయలు పంపించాడు, మరి ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తాయని చెప్పగానే మరో 7 లక్షలు పంపించాడు, మొత్తం డబ్బులు వస్తాయి అనగానే మరో 2 లక్షల 50 వేల రూపాయలు పంపించాడు, మొత్తం డబ్బులను ఆర్టిజిఎస్ ద్వారా సైబర్ నేరగాడు పంపిన బ్యాంకు అకౌంట్ లోకి పంపించడం జరిగింది. తదుపరి ఆ వ్యక్తికి కాల్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది, బాధితుడు పంపించిన అకౌంట్ బ్లాక్ లిస్టులో పెట్టినాడు. సదరు బాధితుడు మొత్తం 22, 88, 980/- రూపాయలు పంపించడం జరిగింది. అనుమానం వచ్చిన సదరు బాధితుడు వెంటనే సైబర్ సెల్ జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1930 కాల్ చేసి ఫిర్యాదు చేయడం జరిగింది.




