చిన్నకోడూర్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 31:చిన్నకోడూరు మండలం అల్లిపూర్ గ్రామంలో ఉన్న కేజీబీవీ స్కూల్ బాలికలకు….మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి సైబర్ నేరాల గురించి, గుడ్ టచ్ బాడ్ టచ్, మరియు తదితర అంశాల గురించి అవగాహన కల్పించిన చిన్నకోడూర్ ఎస్ఐ సుభాష్ గౌడ్, సిద్దిపేట షీటీమ్ సిబ్బంది.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మాట్లాడుతూ కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం బాలికల మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి, జరుగుతున్న సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు.బాల్య వివాహాలు దాని యొక్క పరిణామాల సోషల్ మీడియా దాని యొక్క పరిణామాల గురించి సైబర్ క్రైమ్స్, సైబర్ సెక్యూరిటీ మైనర్ డ్రైవింగ్ డయల్ 100 ప్రాముఖ్యత సమాజ రుక్మతల గురించి సమాజంలో జరుగుతున్న నేరాలు వాటి నుండి ఎలా రక్షణ పొందాలి అనే అంశాల గురించి సెల్ఫ్ కాన్ఫిడెన్స్సె ల్ఫ్ డిఫెన్స్ మహిళల పిల్లల రక్షణకు ఉన్న చట్టాల గురించిడ్రగ్స్, గంజాయి మత్తు పదార్థాలు వాడటం వల్ల జరిగే పరిణామాల గురించి సైబర్ ఆన్లైన్ మోసాలు
ఆన్లైన్ లోన్ న్యూడ్ కాల్స్ గురించి సోషల్ మీడియా వల్ల జరుగు నష్టాలు లాభాల గురించి.గతంలో జరిగిన నేరాల గురించి నేరాల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి.భరోసా సెంటర్లో ఫోక్సో కేసులలో 18 సంవత్సరాలు లోపు ఉన్న బాలికలకు అందిస్తున్న సేవల గురించి.షీ టీమ్ దాని యొక్క ప్రాముఖ్యత నిర్వహించే విధుల గురించిమానవ అక్రమ రవాణా ఫోక్సో చట్టాల గురించిమహిళలు గృహహింసకు వరకట్నం గురించి శారీరకంగా మానసికంగా హింసించే తదితర అంశాల గురించి స్నేహిత మహిళా సెంటర్లో నిర్వహించే కౌన్సిలింగ్ గురించి వివరించారు.విద్యార్థులు యొక్క గోల్ గురించి. అపరిచిత వ్యక్తులతో ఎలా ప్రవర్తించాలని అంశాల గురించి.యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, మరియు తదితర అంశాల గురించి మరియు చట్టాల గురించి విద్యార్థినిలకు వివరించారు. ఎవరైనా వేధించిన రోడ్డుపై వెళ్లేటప్పుడు అవహేలనగా మాట్లాడిన ఉద్దేశపూర్వకంగా వెంబడించిన వెంటనే డయల్ 100,, సిద్దిపేట షిటీమ్ వాట్సప్ నెంబర్ 8712667434, స్నేహిత మహిళా సపోర్ట్ సెంటర్ 9494639498, మహిళా పోలీస్ స్టేషన్ సిద్దిపేట 8712667435 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ శారద, అధ్యాపకులు, సిద్దిపేట షీ టీమ్ సిబ్బంది కిషన్, ఏఎస్ఐ, మహిళా కానిస్టేబుళ్లు ప్రేమలత, వీణకుమారి, కానిస్టేబుళ్లు ప్రవీణ్, లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.




