ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,అక్టోబర్ 17 : షాబాద్ మండల పరిధిలోని సోలిపేట గ్రామానికి చెందిన తేరుపల్లి సునంద సేవా రత్న నేషనల్ అవార్డుకు బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో అక్టోబర్ 15వ తేదీన న్యూఢిల్లీలో జరిగిన ఆల్ ఇండియా బహుజన రైటర్స్ నాలుగవ నేషనల్ కాన్ఫరెన్స్లో బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ, జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎం సుబ్రమనియన్ చేతుల మీదుగా అవార్డును అందుకోన్నారు.ఈ అవార్డును అందజేసిన వారితో పాటుగా ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షులు మన్వీర్ సింగ్ పర్వా,నేషనల్ కోఆర్డినేటర్ డా”ఎం విజయలత, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎం ఎం గౌతమ్ ఉన్నారన్నారు.గ్రామంలో అనేక సేవలు చేసి అంచలంచలుగా ఎదుగుతూ ఏఐఎం పార్టీలో చేరి కార్వాన్ డివిజన్లోని లంగర్ హౌస్ లో ప్రజలకు అనేక రకాలుగా సేవలు అందిస్తూ,పేద ప్రజలకు గడచిన లాక్ డౌన్ లో ఆహార వస్తువులు స్వచ్ఛందంగా పంపిణీ చేశారన్నారు.తేరుపల్లి సునంద సేవలను గుర్తించి నేషనల్ బహుజన సాహిత్య అకాడమీ సంస్థవారు సేవారత్న నేషనల్ అవార్డు అందుకున్నారు. అనంతరం సేవారత్న నేషనల్ అవార్డుకి ఎంపికైన తేరుపల్లి సునంద మాట్లాడుతూ ఈ అవార్డు ను అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.ప్రజలందరూ సహకరిస్తే భవిష్యత్తులో పేద బడుగు,బలహీన వర్గ ప్రజలకు అనేక సేవలను అందిస్తామన్నారు.
సేవారత్న నేషనల్ అవార్డు అందుకున్న తేరుపల్లి సునంద





