ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 10 : కడ్తాల్ మండలంలోని ముద్విన్ గ్రామంలో సర్వ్ సంస్థ అందిస్తున్న సేవలను సద్వినియోపరుచుకోవాలని కడ్తాల ఎంపీపీ కమ్లి మోత్య నాయక్ అన్నారు. ముద్విన్ గ్రామంలో ఉన్న దివ్యాంగులకు ఉచితంగా బస్సు పాసులను పంపిణీ చేశారు. ఈ బస్ పాస్ వల్ల బస్సులలో 50% రాయితీ పొందవచ్చునని తెలిపారు. ఈ బస్ పాస్ లను దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ముద్విన్ సర్పంచ్ నక్కపోతు యాదయ్య, ఎంపీటీసీ నిర్మాల కాశినాథ్ రెడ్డి, వార్డుమెంబెర్ లు పాల్గొన్నారు.


