సృజనాత్మక శక్తిని వెలికి తీసేందుకు ఇంటింటా ఎన్నోవేటర్ : జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, జులై 31: ఇంటింటా ఇన్నోవేటర్ ఆవిష్కరణలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఇంటింటా ఎన్నోవేటర్ అనే కూడా పత్రికను కలెక్టర్ ఆవిష్కరించినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన ఆవిష్కరణల ద్వారా తమలోని సృజనాత్మకతను వెలికితీసే “ఇంటింటా ఇన్నోవేటర్” కార్యక్రమం ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ “ఇంటింటా ఇన్నోవేటర్” కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ (TSIC) వారు జిల్లాలో అన్ని రంగాలలోని ప్రజల నుండి వాట్సప్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారని, గ్రామాలలో, పట్టణాలలో ఉండే అన్ని రంగాలు, వర్గాల నుండి ఆవిష్కరణలు ఆహ్వానించబడుతున్నట్లు, అంటే గ్రామీణ ఆవిష్కరణలు, విద్యార్థుల ఆవిష్కరణలు, ప్రారంభ ఆవిష్కరణలు, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలలో ఆవిష్కరణలు మొదలైనవి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఆవిష్కర్తలు తమ ఆవిష్కరణ వివరాలు తెలుపాలని అన్నారు. ఆవిష్కర్త పేరు, వయస్సు, ఫోటో, వృత్తి, గ్రామం, మండలం, జిల్లా, ఆవిష్కరణ పేరు, ఆవిష్కర గురించి 6 వాక్యాలు,ఆవిష్కరణకు సంబంధించిన 4 ఫొటోలు, ఆవిష్కరణకు సంబంధించిన 2 నిమిషాల వీడియోను 9100678543 అనే నంబరుకు వాట్సప్ ద్వారా వచ్చే ఆగస్టు 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఎంపిక అయిన ఆవిష్కరణలను జిల్లాలో ఆగస్టు 15 న జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో వాటిని ప్రదర్శించే అవకాశం ఉంటుందని, ఆవిష్కర్తలకు సర్టిఫికేట్ల ప్రదానంతో పాటు TSIC టీం ద్వారా ఉత్తమ ఆవిష్కరణలకు సాంకేతిక సహకారం కూడా అందించబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకా దేవి, e – డిస్టిక్ మేనేజర్ మహేశ్వరం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *