సూర్యుడా..ఓ సుధాకరుడా..!

ఉగ్గుపాలతో ఉద్యమాన్ని జీర్ణం చేసుకుని
పీపుల్స్‌ వారే ఉచ్ఛ్వాస  నిశ్వాసలుగా ప్రాణం పోసుకున్నవాడు
శంకర్‌ అమరత్వాన్ని  ముద్దాడి ఆశయాలని కలగంటూ
ఆటల్లో పాటల్లో అమరుల గీతాన్ని ఆలపించిన వాడు
అతడు అమరుడు కాక ఏమవుతాడు మరి
వయసులో వరిగింజ అయితే నేమి  మనసు మహా సముద్రం
పుట్టుక
అట్టడుగు వర్గపు బాయిలో వేస్తేనేమి
అగ్నిపర్వతమంత శక్తిని అణువణువునా నింపుకొని
దారి పొడవునా విప్లవ దండోరా మోగించినవాడు
అతడు అమరుడు కాక ఏమవుతాడు మరి
నాటు నాటు పాటతో ఆస్కార్‌ అందుకుని చల్లగరిగకు చరిత్రలో స్థానం రాకముందే విప్లవ చరిత్రలో భాగమై చరిత్ర సృష్టించే సాహసంతో సుధాకరుడై బయలుదేరి
ఆయుధం అందుకుని
శరీరాన్ని ఆయుధంగా
ఆయుధాన్ని శరీరంగా మార్చుకొని
ఆకలి కేకల వెతలని భుజాన మోసుకొని
మురళిగా జగిత్యాల కోరుట్ల
మెట్టుపల్లి బాన్సువాడ
కామారెడ్డి ఆదిలాబాద్‌ మీదుగా దండకారణ్యమంత శంకర్‌గా
విప్లవ విత్తనాలు వెదజల్లిన వాడు
నేడో రేపో ఎల్లుండో
అమరుడు కాక ఏమవుతాడు మరి
అతడి అమరత్వం
మన హృదయాన్ని
కకలావికలం చేయవచ్చు
మనసు మేఘమై కన్నీటి జడివాన  కురిపించవచ్చు ఉగ్గుపాలతో ఉద్యమాన్ని జీర్ణం చేసుకుని విప్లవమే ప్రాణవాయువై
పేరుని ఊరుని ప్రాంతాన్ని
సొంత అస్తిత్వాన్ని వదులుకుని చిటారున నిటారుగా నిలుచుని జీవితమంతా
విప్లవ శంఖారావం
వినిపించిన వాడు అమరుడై వస్తున్నాడు అమరత్వాన్ని ముద్దాడి పరిమళాన్ని పంచుదాం రండి రండి..
   -శాఖమూరి రవి

కాలంతో మనిషి

కాలం
సలసలకాగే కాలం
చెట్లనీడలకైజి
చల్లటి నీటి మునకకై
నారికేళ పానీయం
నిమ్మకాయ షర్బత్‌
లస్సీ చల్ల కొరకు
పరుగులు పరుగులు…

వడదెబ్బ
మురుగు నీటి బెడద
మంచి నీటి కొరత
నానారోగాలతో జనం…

అక్కడక్కడ చలివేంద్రాలు
దాతలు చల్లపాకెట్ల పంపిణి
పక్షులకు జంతువులకు
పక్షిజంతు ప్రేమికుల సేవలు…

చల్లటి నీటి చినుకుకై
అధికార యంత్రాంగం చొరువకై
పడిగాపులుజి
తెల్లని మేఘం
చెల్లని నాణ్యం
ఆశలు అడియాశలు…

కాలంతో పాటు నడువాలి
పరిస్థితులకు ఎదురీది నిలువాలి

-రేడియమ్‌జి
9291527758

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *