- తెలంగాణ ఉద్యమకారులారా..
నాతో పాటు టీఆర్‌ఎస్‌లో పనిచేసిన నాయకులారా.. - తెలంగాణ అభివృద్ధి కోసం, దేశాభివృద్ధికి బీజేపీకి
వోటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి - మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్
మేడ్చల్ మల్కాజిగిరి, ప్రజాతంత్ర, మార్చి 29: తెలంగాణ ఉద్యమకారులారా.. నాతో పాటు టీఆర్‌ఎస్ లో పనిచేసిన నాయకులారా.. తెలంగాణ అభివృద్ధి కోసం, దేశాభివృద్ధికి బీజేపీకి వోటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ స్పష్టంచేశారు. శుక్రవారం మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథులుగా మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు హాజరైనారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. రేవంత్ ఊసరవెల్లిలా మాటలు మాట్లాడుతున్నారన్నారు. మల్కాజ్గిరికి మొదటి సారి ప్రధాని మోదీ వచ్చినప్పుడు మోదీ మా పెద్దన్న అనీ ఆయనే మోదీ గీడీ అని మాట్లాడు తున్నారు.
రేవంత్ నువ్వు చిన్న మనిషివి బిడ్డా అధికారం మీ అమ్మ నాన్న ఇచ్చింది కాదనీ కేసీఆర్ ను ఓడగొట్టడానికి ప్రజలు ఇచ్చిన తీర్పు అని అన్నారు.మోదీని విమర్శించిన వారు ఏమైపోయారో చూశాం అని నీకు అదే గతిపడుతుందనీ రాజేందర్ అన్నారు. ప్రజలు మొన్న చిన్న ఎన్నికలలో కాంగ్రెస్‌కు వేశామని, ఇప్పుడు పెద్ద ఎన్నికలు మోదీకే వేస్తాం అని ప్రజలు అంటున్నారని ఈటల పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ వోటు నమోదు చేసుకోవాలని, వోటు ఉందో లేదో చెక్ చేసుకోవాలని తప్పకుండా వోటు హక్కు వినియోగించు కావాలని ఈటల్ రాజేందర్ పిలుపునిచ్చారు.సుస్థిర, సుసంపన్న, శాంతుయుత పాలన కావాలంటే మోదీకి వోటు వేయాలని ఈటల విజ్ఞప్తి చేశారు. నాకు వరంగల్ సీటు ఇస్తా అంటే వద్దు అని పారిపోతున్నారన్నారు. బి ఆర్ ఎస్ మొన్నటి వరకు అన్నింటిలో నంబర్ వన్ అని చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు పోటీ చేయడానికి అభ్యర్థులు లేక దిక్కు తోచని స్థితిలో ఉందని, వరంగల్ సీటు ఇస్తా అంటే వద్దు అని ఉన్నవారు జారిపోతున్నారన్నారు.పదేళ్ల తరువాత ప్రజలు మోదీని మళ్ళీ ఆశీర్వదిస్తుంటే, కేసీఆర్ ను ప్రజలు చీదరించుకొని ఖతం చేస్తున్నారనీ అన్నారు.
తెలంగాణ ఉద్యమకారులారా.. నాతో పాటు టీఆర్‌ఎస్ లో పనిచేసిన నాయకులారా..
తెలంగాణ అభివృద్ధి కోసం, దేశాభివృద్ధికి బీజేపీకి వోటు వేయండనీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ పుట్టిన యూపీ లోనే అడ్రస్ లేక.. వేరే సీట్లో గెలిచారనీ,కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలుచేస్తే దేనికంటే దానికి రెడీ అని ఈటల ఛాలెంజ్ చేశారు.మల్కాజిగిరినీ నరేంద్రమోదీ గుండెల్లో పెట్టుకున్న నియోజకవర్గం అని, ఈ ప్రజల ప్రేమకు ముగ్ధులు అయ్యారని నాగర్ కర్నూల్, జగిత్యాలలో చెప్పారనీ తెలిపారు. ఈ ప్రేమతో జీవితం ధన్యం అయ్యింది అన్నారు.
బీజేపీ గెలిచే 400 స్థానాల్లో మల్కాజిగిరి కూడా ఒకటి ఉండబోతుంది అని ఆయన అన్నారు.
ప్రజల భాగస్వామ్యంతోనే మల్కాజిగిరి మోదీ రోడ్ షో విజయవంతం అయ్యిందనీ,కిలోమీటర్ల మేర రోడ్డుకి ఇరువైపుల నిలబడి స్వాగతం పలికారన్నారు.తెలంగాణ గడ్డ మీద ప్రజల సంఫీుభావం మోడీ మదిలో చిరస్థాయిగా నిలబడిరదనీ, కేవలం నార్త్ ఇండియాలోనే కాదు సౌత్ ఇండియాలో కూడా మోదీ ప్రభంజనం ఉంది అని నిరూపించారనీ రాజేందర్ అన్నారు.ఈసారి మాకు పార్టీ జెండా సిద్ధాంతం సంబంధంలేదు మావోటు మోదీకి, ఈటల రాజేందర్ కే అని ప్రజలు చెప్తున్నారనీ, మల్కాజ్గిరి పార్లమెంటు స్థానాన్ని భారీ మెజారిటీ తో మోదీకి కట్టబెట్టబోతున్నారనీ పేర్కొన్నారు.కనపడే మద్దతు కంటే కనపడని మద్దతు ఎక్కువ ఉందనీ,ప్రపంచదేశాలు కూడా మళ్ళీ మోదీనే ప్రధాని అవుతారని ప్రజలు నమ్ముతున్నారనీ తెలిపారు.
ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ప్రధాని మన నరేంద్ర మోదీ అని,మోదీ హయాంలో 12 కోట్ల టాయిలెట్స్ కట్టించారనీ తెలిపారు. మోదీ10 ఏళ్ల పాలనలో బాంబుల మోతలు లేవు.. తెగిపడ్డ శరీరాలు లేవనీ,పుల్వామా దాడి చేస్తే.. సర్జికల్ స్ట్రైక్ చేసి బదలా తీర్చుకున్నారనీ, ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా నినాదం కాదు విధానం అని తెలిపారు.డబ్బు, మద్యంకి పాతర వేయండినీ,ధర్మాన్ని గెలిపించండి అని కోరుతున్నాననీ ఈటల రాజేందర్ అన్నారు.




