సుమారు 1200 మంది ఫోన్లు ట్యాప్‌

  • ప్రధానంగా ప్రతిపక్ష నేతలపైనే దృష్టి
  • నేతలు, జడ్జిలు, స్థిరాస్థి వ్యాపారుల పోన్ల ట్యాప్‌
  • వాంగ్మూలంలో పేర్కొన్న ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 29 : సుమారు 1200 మంది ఫోన్లు ట్యాప్‌ చేసినట్లు ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు అంగీకరించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుకు సంబంధించి ఆయన వాంగ్మూలంలో పేర్కొన్న కీలక విషయాలు బయటకు వచ్చాయి. ప్రధానంగా ప్రతిపక్ష నేతలపై నిఘా పెట్టామని, వారికి వెళ్లే డబ్బును అడ్డగించి పట్టుకున్నట్లు పేర్కొన్నారు. నేతలు, జడ్జిలు, స్థిరాస్తి వ్యాపారుల ఫోన్లు ట్యాప్‌ చేసినట్లు అంగీకరించారు. కన్వర్జెన్స్‌ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌ సాప్ట్‌వేర్‌ సాయంతో ట్యాపింగ్‌కు పాల్పడినట్టు తెలిపారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ పర్యవేక్షణ కోసం 17 కంప్యూటర్లను వినియోగించామని, 56 మంది ఎస్‌వోటీ సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు వెల్లడిరచారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ట్యాపింగ్‌ ఆపేయాలని ప్రభాకర్‌రావు నుంచి ఆదేశాలు అందినట్లు చెప్పారు. ఆయన రాజీనామా చేసే ముందు రికార్డులన్నీ ధ్వంసం చేయాలని సూచించినట్లు తెలిపారు. రికార్డులు ధ్వంసం చేసి కొత్తవాటిని అమర్చామని పేర్కొన్నారు. ధ్వంసం చేసిన  ఆధారాలను నాగోలు, మూసారాంబాగ్‌ వద్ద మూసీ నదిలో పడేసినట్లు వెల్లడిరచారు. సీడీఆర్‌, ఐడీపీఆర్‌ డేటా మొత్తం కాల్చేసినట్లు పేర్కొన్నారు. ఫార్మాట్‌ చేసిన ఫోన్లు, పెన్‌డ్రైవ్‌లను బేగంపేట నాలాలో పడేసినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *