సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయని రాష్ట్ర ప్రభుత్వంపై కేసు లు పెట్టాలి

సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు
అంగన్వాడి టీచర్లు, ఆయాల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలి
 అంగన్వాడీ టీచర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి 26 వేల వేతనం ఇవ్వాలి
1972 గ్రాజ్ విటి చట్టం అమలు చేయాలి
బెదిరింపులకు పాల్పడుతున్న పాలకులు
అంగన్వాడీలకు అండగా నిలవాలి
ప్రభుత్వం వెంటనే చర్చలకు పిలవాలి
పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 14: సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయని రాష్ట్ర ప్రభుత్వంపై కేసులు పెట్టాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు అన్నారు. అంగన్ వాడి ల సమస్యల సాధన కోసం చేస్తున్న సమ్మె నాలుగో రోజుకు చేరుకుంది. గురువారం రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా పట్టణంలోని సిడిపి వో కార్యాలయం లో సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు,రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో 70 వేల మంది అంగన్వాడీ టీచర్లు,ఆయాలు వున్నారని అన్నారు.గత 40 సంవత్సరాలుగా పనిచేస్తున్న కనీస వేతనంకు నోచుకోలేదన్నారు.సమ్మె డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వానికి 14 రోజు సమ్మె నోటీస్ ఇచ్చి,తప్పని పరిస్తితుల్లో సమ్మెకు దిగిన విషయాని గుర్తుచేశారు.కార్మిక చట్టాల ప్రకారం ప్రజాస్వామ్య బద్దంగా అంగన్వాడీ లు సమ్మె చేస్తున్నారని అన్నారు.అధికారులు సెంటర్స్ తాళాలు పగులగొట్టి టీచర్లను హెల్పర్లను భయ బ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు.1972 గ్రాటు వీటి చట్టం ప్రకారం సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రా టు వీటి చెల్లించాలన్నారు.కర్ణాటక లాంటి రాష్ట్రంలో అంగన్వాడీ లు సమ్మె చేసి గ్రాటి వీటి సాధించుకున్న విషయాని గుర్తుచేశారు. గ్రాటివిట్ అమలు చేయని మన ప్రభుత్వం,అధికారులపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. పర్మినెంట్ చేయడంతో పాటు కనీస వేతనం 26 వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు.రిటైర్ మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు 10 లక్షలు,అయాలకూ 5లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు.అన్ని డిమాండ్ల ను పరిష్కరించకుండా మట్టి ఖర్చుల కింద టీచర్లకు 20వేలు,ఆయలకు 10 వేలు ఇస్తామనడం హాస్య స్పదంగ వుందన్నారు.సమ్మె డిమాండ్ల విషయంలో మంత్రులకు విన్నవించినా పరిష్కారం లేదని అన్నారు.ప్రజా స్వామ్య దేశంలో ప్రజలు ఓట్లు వేస్తేనే ప్రభుత్వం ఏర్పడ్డ విషయం మర్చి పోవొద్దన్నారు.ఇదేమి రాజుల,రాచరిక పాలన కాదని అన్నారు.జాయింట్ యాక్షన్ కమిటీ తో వెంటనే చర్చలు జరపాలని లేని పక్షంలో చలో కలెక్టరేట్,హైదరాబాద్ కార్యక్రమము చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం ను హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి సాయిలు,జిల్లా ఉపాధ్యక్షులు బి. నాగేశ్వరరావు,కోశాధికారి నర్సింహారెడ్డి,పటాన్ చెరు,రామచంద్ర పురం, అమీన్ పూర్,జిన్నారం, కంది, మండలాల టీచర్లు యేసుమని,కల్పన,నాగలక్ష్మి,రాణి,జమున, రూప తదితర టీచర్లు, ఆయాలు లు, పెద్ద యెత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *