సీ.ఎం.రిలీఫ్ ఫండ్ తో ఎంతో మంది పేదలకు లబ్ది..సుదీర్ రెడ్డి

వనస్థలిపురం ప్రజాతంత్ర ఆగస్టు 17: బాధితుడు రాజు కి 2,50,000 రూపాయల ఎల్.ఓ.సీ.ఆందజేస్తున్న ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుదీర్ రెడ్డి గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని మధురపురి కాలనీకు చెందిన రాజు నరాలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో అయితే వారి యొక్క ఆర్థిక స్థితులు బాగలేక వారు వారి యొక్క కుటుంబసభ్యులు ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుదీర్ రెడ్డి ని సంప్రదించారు.వెంటనే స్పందించిన సుదీర్ రెడ్డి అట్టి ఆపరేషన్ కు కావలసిన డబ్బుల వివరాలను ముఖ్యమంత్రి సహాయనిదికి దరఖాస్తు చేయడం జరిగింది.దానికి గాను వారికి 2,50,000(రెండు లక్షల యాబై వేల రూపాయలు) ఎల్.ఓ.సీ.చెక్కు మంజూరు కావడం జరిగింది.ఈ సందర్భంగా సుదీర్ రెడ్డి మాట్లాడుతూ.పేదల ఆరోగ్య పరిరక్షణకు సీ.యం.సహాయనిధి దోహదపడుతుంది అని అన్నారు.ఈ పథకం పేదలకు ఓ వరం లాంటిది అని అన్నారు.పేద ప్రజలకు నాణ్యమైన అధునాతన వైద్య సేవలను పొందేందుకు సీ.ఎం.సహాయనిది అండగా ఉంటుంది అని అన్నారు.ఎల్.బి.నగర్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం పనిచేస్తాను అని తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో యువ నాయకులు గండి సన్నియాదవ్,కిరణ్,ప్రతిక్  పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *