ఉప్పల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 6: సీనియర్ సిటిజన్స్ కు అన్ని పథకాలను అమలు అయేవిధంగా కృషి చేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం మల్లాపూర్ లోని సీనియర్ సిటిజన్ నూతన భవన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా బండారి లక్ష్మారెడ్డి స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ
స్వయం కృషి తో నిర్మించికున్న సీనియర్ సిటిజన్స్ భవనానికి అన్ని వసతులు కలిపిస్తానని హామీ ఇచ్చారు ఆశ్రయం పథకం లో సీనియర్స్ కు కావలిసిన సౌకర్యాల కల్పన అందజేస్తా అన్నారు. భవనంలో లైబ్రరీ,యోగ, అధ్యాత్మిక కేంద్రాలు ఏర్పాటు చేసుకునేందుకు వీలుందన్నారు.
సీనియర్ సిటిజన్స్ కు అన్ని పథకాల ను అమలు అయేవిధంగా కృషి చేస్తానన్నారు.
చెవూరి అన్నదానం:
కార్తీక మాస వన భోజనం కార్యక్రమాన్ని నూతన భవనం లో నిర్వహించడం పట్ల ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఉషశ్రీ
దంపతులు అభినందించారు.
ఈ కార్యాక్రమంలో
గోకుల్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ టి.మల్కయ్య ,
సాంబశివరావు, పి ఎన్ స్వామి, చేవూరి సుదర్శన్ ,ఆస్రా రాష్ట్ర నాయకులు నాగేశ్వర్ రావు , కాప్రా ప్రాంత సీనియర్ సిటిజెన్ సంఘాల నాయకులు పాల్గొన్నారు.



