సీనియర్ పాత్రికేయులు దేవులపల్లి అమర్ కు విశిష్ట పురస్కారం

హైదరాబాద్ ,మార్చి 19: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జాతీయ మీడియా సలహాదారు,సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ మీడియా రంగంలో ఆయన ప్రతిభను గుర్తించి కేరళ రాష్ట్రానికి చెందిన మల నాడు  మీడియా గ్రూప్ 2022 సంవత్సరం కు  అమర్ ను ఎంపిక చేసింది . శనివారం కొచ్చి లో జరిగిన సంస్ధ  వార్షికోత్సవం లో అమర్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

మలనాడు టీవీ ఇండియా (ఎంఎన్ టివి) నిర్వహించిన పదవ వార్షిక బిజినెస్ కాంక్లేవ్ లో వివిధ రంగాల్లో ప్రముఖులకు పురస్కారాలు అందజేసింది. శనివారం కొచ్చిలో నిర్వహించిన బిజినెస్ సదస్సులో మీడియా రంగం నుంచి ఎంపికైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ అవార్డు అందుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *