ఆమనగల్లు, ప్రజాతంత్ర జులై 31. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమంతంగా ఉండాలని ఆమనగల్లు ప్రభుత్వ వైద్య అధికారి పరీకత్ అన్నారు. సోమవారం మున్సిపాలిటీలోని సూర్యలక్ష్మి పత్తి మిల్లులో అవగాహన సదస్సు, ఆరోగ్య వైద్య శిబిరము నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కండ్ల కలక, కీటక జనిత వ్యాధులు సాంక్రమిక వ్యాధులు టీబీ వ్యాధి వ్యాప్తి పై అవగాహన మరియు వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. టీబీ వ్యాధిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారిని విజయలక్ష్మి, కాటన్ మిల్ అధ్యక్షులు ఆర్ఎల్ -నారాయణ, వైస్ ప్రెసిడెంట్ సాయిబాబా, కేశవరెడ్డి, సిహెచ్ఓ విజయ, పి హెచ్ ఎన్ -లక్ష్మి, సూపర్వైజర్ శ్రీనివాస్, టీబీ సూపర్వైజర్ విజయ్, అలీమ్, మహిళా ఆరోగ్య కార్యకర్తలు సీత, మరియు అసిఫా, ఆశా కార్యకర్త సల్మా, తదితరులు పాల్గొన్నారు


