సీఎం సహాయనిధి చెక్కులను అందజేసిన ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురికి ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు ఈమేరకు ఆయన సోమవారం నియోజకవర్గ పరిధిలోని పలువురికి వైద్య చికిత్స నిమిత్తం   సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకొనగా ముఖ్య మంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.11,62,000/- పదకొండు లక్షల అరవై రెండు వేల రూపాయల చెక్కులను బాధిత కుటుంబాలకి  మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు తో కలిసి అందచేశారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు నుంచి సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రమును అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెలిపారు. దేశంలోనే మేటి రాష్ట్రంగా తీర్చిదిద్దుటకు అభివృద్ధి పనులను చేపట్టి నిర్విరామ కృషి చేస్తున్నారని పునరుద్ఘాటించారు. అభివృద్ధి పనులలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. సంక్షేమ పథకాలలో ముఖ్యమైన ముఖ్యమంత్రి సహాయ నిధి  నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని, అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు .అండగా..సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందని అని అన్నారు. ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవ రెడ్డి, గచ్చిబౌలి డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజు నాయక్,  హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు తిరుపతి రెడ్డి, ప్రసాద్ ,జనార్దన్, బాబు మోహన్ మల్లేష్,శ్రావణి రెడ్డి  మరియు కార్యకర్తలు  తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *