సీఎం ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయండి

మహేశ్వరం ప్రజాతంత్ర నవంబర్ 22: నేడు మహేశ్వరం నియోజకవర్గంలో తలపెట్టిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు బిఅర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున పాల్గొని, విజయవంతం చేయాలని మహేశ్వరం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపు ఇచ్చారు. బిఆర్ఎస్ పార్టీ అధ్వర్యంలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ ఎదురుగా, ఎయిర్ పోర్టు రోడ్, సుల్తాన్ పూర్, బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిర్వహించే సభకు ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజవంతం చేయాలని కోరారు. ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు ముఖ్యఅతిథిగా హాజరై, ప్రజలకు సందేశం ఇవ్వనున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *