.సీఎం కేసీఆర్   రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టారు

ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 24:  సీఎం కేసీఆర్   తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టారని,
ఉప్పల్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మాజీ కార్పొరేటర్లు  కొత్త రామారావు ,పావని మణిపాల్ రెడ్డి ల ఆధ్వర్యంలో  పల్లె ప్యారడైజ్ ఫైవ్ ఎలమెంట్స్ అపార్ట్మెంట్స్   కాప్రా ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిధులుగా  బండారి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ మేరకు పల్లె ప్యారడైజ్  అపార్ట్మెంట్స్ వాసులు  బండారి లక్ష్మారెడ్డికిసంపూర్ణ మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్   రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టారని అన్నారు.  రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందిస్తూ ఎన్నో నూతన సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి సామాన్యుడికి సంక్షేమ పథకాలు చేరేలా పరిపాలన సాగిస్తున్నారనీ తెలిపారు. కేసీఆర్ ని మూడవసారి ముఖ్యమంత్రిని చేసి హ్యాట్రిక్ సాధించాలని బందర్ లక్ష్మారెడ్డి అపార్ట్మెంట్ వాసులను కోరారు. మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, పావని మణిపాల్ రెడ్డి లు మాట్లాడుతూ
 హైదరాబాద్ నగర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసీ ఎనలేని ప్రజాదరణ కూడగట్టుకున్న కేసీఆర్ ని మూడవసారి ముఖ్యమంత్రిని  చేయాలని అభ్యర్థించారు. ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు .ఈ సందర్భంగా పల్లె ప్యారడైజ్ అపార్ట్మెంట్స్ వాసులు మాట్లాడుతూ మాకు ఏ ఆపద వచ్చినా పిలుపుమేరలో అందుబాటులో ఉండే నాయకుడు,  బి ఎల్ ఆర్   ట్రస్ట్ ద్వారా ఎన్నో కుటుంబాలకు సేవ చేసిన బండారి లక్ష్మారెడ్డి  కారు గుర్తుకు ఓటు వేసి, ఉప్పల్ నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపిస్తాం అంటూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు కాసం మహిపాల్ రెడ్డి, మల్లేష్, శ్రీధర్ రెడ్డి, రాజు, గోపాల్ రెడ్డి, రంగారెడ్డి, నవీన్ రెడ్డి, ప్రభ కుమార్, ధన్ సాగర్ రెడ్డి, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *