సిద్దిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: అహ్మదీపూర్ గ్రామంలో 122 మంది గృహలక్ష్మి లబ్ధిదారులకు సర్పంచ్ చాడ నవీన శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రోసీడింగ్ పత్రాలు మార్కేట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ పంపిణీ చేయడం జరిగింది. అనంతరం గృహాలక్ష్మీ లబ్ధిదారులు మహిళలు అందరూ కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి పెద్ద ఎత్తున నినాదాలతో సంతోషం వెలిబుచ్చారు.అదే విదంగా యువతకు స్పోర్స్ మెటీరియల్ అందచేయడం జరిగిందన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహలక్ష్మీ పత్రాలు పంపిణి చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.మహిళే ఇంటికి లక్ష్మి అని నమ్మే ముఖ్యమంత్రి కేసీఆర్ గృహ లక్ష్మి పథకం ద్వారా ఇచ్చే డబ్బును నేరుగా మహిళల ఎకౌంట్లోనే జమచేయాలని నిర్ణయించారు.ఇంతటి గొప్పది కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం కెసిఆర్ కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. మధ్యవర్తులు లేకుండా ఒక్క రూపాయి లంచం ఎవరికి ఇవ్వకుండా నేరుగా ఇల్లు కట్టుకునేందుకు 3 లక్షల రూపాయలు ఇంటి మహాలక్ష్మి పేరు మీద జమ చేయబడతాయని అన్నారు, మహిళలు ప్రతి రూపాయి పొదుపుగా సద్వినియోగం చేసి ఇంటిని నిలబెడతారని ఉద్దేశ్యంతో ఈ పథకానికి గృహలక్ష్మీ అని పేరు పెట్టడం జరిగిందన్నారు.నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చాక పార్టీలకు అతీతంగా అందరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు.ఇండ్లు లేని నిరుపేదల కోసం ఖాళీ స్థలం ఉండి సొంత ఇల్లు కట్టుకోవడానికి 3 లక్షల ఆర్థిక సహాయం అందచేయడం జరుగుతున్నధని అన్నారు.దశల వారిగా అర్హులకు పేదల ఇంటి నిర్మాణం కోసం ఈ పథకం అమలు అవుతుందని అన్నారు. మీరిచ్చిన బలంతో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో మంత్రి హరీష్ రావు ఆశీస్సులతో అహ్మదీపూర్ గ్రామాన్ని ఇంకా మరింత అభివృద్ధి చేసుకుందామని తెలిపారు.ప్రజల అవసరాలకు అనుగుణంగానే కోరికలు ఒకొక్కటిగా నెరవేర్చడం జరుగుతుందని అన్నారు. గత పాలకుల మాటలు కేవలం గోడమీద రాతలు, ఎన్నికల్లో నినాదాలు మాత్రమేనని, సీఎం కేసీఆర్ చొరవతో గజ్వేల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుందని అన్నారు. మంచి కార్యక్రమలు చేస్తున్న ఇంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని అందరం ఆదరించి, తమ ప్రేమను పంచాలని పని చేసిన మన ప్రభుత్వం వైపు ఉండాలని, గోబెల్స్ అబద్దాలు ప్రచారం చేసే వారి వెంట పోకూడదు అని పిలుపునిచ్చారు.సద్ది తిన్న రేవు తలవాలి సహాయం చేసిన వారిని మరవొద్దని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో రైతుబందు సమితి మండల అధ్యక్షుడు మద్ది రాజిరెడ్డి, .ఎంపీటీసీ ఆనందం, గ్రామ కార్యదర్శి శ్రీనివాస్,మండల పార్టీ ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్, మాజీ కో ఆప్షన్ అహ్మద్, గ్రామా పార్టీ అధ్యక్షుడు నిజామోద్దీన్, ఉప సర్పంచ్ చంద్రకళ, వార్డు సభ్యులు నరేందర్ రెడ్డి, నాంపల్లి, ఎల్లయ్య, అదెపు శ్రీనివాస్, అయ్యాలం, సంతోష్, సాకలి శ్రీనివాస్, బిక్షపతి, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ అంటేనే నమ్మకం, విశ్వాసం.. గృహలక్ష్మీతో సొంతింటి కల సాకారం




