పరిగి,ప్రజాతంత్ర, ఆగస్ట్ 03: రైతు రుణమాఫీ ప్రకటించిన నేపథ్యంలో ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి కలిసి నియోజక వర్గ రైతులు,ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు . రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని,ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత కేవలం బిఆర్ఎస్ ప్రభుత్వానిదే అని అన్నారు. కార్యక్రమంలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి , వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్,చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ,పలు నియోజక వర్గ ఎమ్మెల్యేలు ఉన్నారు.



