సిసి రోడ్డు పనులను ప్రారంభించిన కౌన్సిలర్ కమటం రాధమ్మ

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 20 : మున్సిపాలిటీలోని ఎనిమిదో వార్డు బి.సి కాలనీ, సంకటోనీపల్లిలో టి యు ఎఫ్ ఐ డి సి నిధుల నుంచి రూ. 30 లక్షలతో 340 మీటర్ల వరకు చేపట్టుతున్న సీసీ రోడ్డు పనులను కౌన్సిలర్ రాధమ్మ వెంకటయ్య, మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్ ల తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీసీ పనులలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమములో మార్కెట్ డైరెక్టర్ రమేష్, యూత్ వింగ్ దేరంగుల వెంకటేష్, గణేష్, కాలనీ వాసులు ఖుద్దూస్, బాబా, బాలయ్య, కిరణ్, ఎల్లయ్య, శ్రీను, లక్ష్మమ్మ, అలివేలు, జంగమ్మ, గౌసియా బేగం, వెంకటయ్య, అచ్చ్చమ్మ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *