వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష కోసం 2023-2024 విద్యా సంవత్సరంలో 100 మందికి మైనారిటీలకు ఉచిత కోచింగ్‌ను నిర్వహిస్తున్నట్లు జిల్లా అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ అధికారి సుధారాణి ఒక ప్రకటనలో తెలిపారు. ముస్లిం, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు మరియు పారసిలు అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ స్టడీ సర్కిల్, మైనారిటీల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కోచింగ్ ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు. ఈ నెల 20న స్క్రీనింగ్ టెస్ట్ ప్రవేశ పరీక్షా జరగవలసిన స్క్రీనింగ్ టెస్ట్ ప్రవేశ పరీక్షా ఆగస్టు 28 (సోమవారం) నకు వాయీదా వేయబడినదని, సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు అన్ని జిల్లా కేంద్రము లో గల తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్వహించబదుతుందని ఆమె తెలిపారు. ఇతర వివరములకు 040-23236112 కార్యాలయ సమయములలో ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు పని దినాలలో సంప్రదించాల్సిందిగా ఆమె ఆ ప్రకటనలో తెలిపారు.


