సిద్దిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4: సిరిసిల్ల ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో శ్రీలంబోదర కల్చరల్ అకాడమీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో ఆస్కార్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నేషనల్ కో ఆర్డినేటర్ కె.వి రమణారావు సిరిసిల్ల బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చక్రపాణి, మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ మొహమ్మద్ సలీం, శ్రీ లంబోదర కల్చరల్ అకాడమీ చైర్మన్ కళ అశోక్ చేతుల మీదుగా ముహమ్మద్ వహీదుద్దీన్ (కవి, రచయిత, ఉపాధ్యాయుడు-సిద్దిపేట కు ఆస్కార్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికెట్ జయహో భారత్ అవార్డ్-2023 తో సత్కరించడం జరిగింది.


