సియాటెల్‌ ‌నగరంలో కులవివక్ష నిషేధం

అమెరికన్‌ ‌తొలి నగరంగగా రికార్డు
న్యూ దిల్లీ, ఫిబ్రవరి 22 : అమెరికాలోని సియాటెల్‌ ‌నగరం రికార్డు సృష్టించింది. కుల వివక్షను నిషేధిస్తూ దేశంలోనే  తొలి నగరంగా నిలిచింది. ఈ మేరకు సియాటెల్‌ ‌నగర కౌన్సిల్‌ ఆర్డినెన్స్ ‌తీసుకొచ్చింది. దీంతో సియాటెల్‌ ‌కులవివక్షను నిషేధించిన తొలి అమెరికా నగరంగా నిలిచిందని ’అసోసియేటెడ్‌ ‌ప్రెస్‌’ ‌వార్తాసంస్థ వెల్లడించింది. కుల వివక్షను చట్ట విరుద్ధం చేయాలని అమెరికాలోని దక్షిణాసియా ప్రజలు డిమాండ్‌  ‌తీవ్ర రూపం దాల్చడంతో ఈ నిర్ణయం తీసుకుంది.  ఇలాంటి చట్టాలు చేయడమంటే ఆయా నిర్దిష్ట సమాజాలను కించపరచడమేనని కొందరు హిందూ అమెరికన్లు వాదిస్తున్నారు.

కుల వివక్షను నిషేధించాలన్న ప్రతిపాదనపై సియాటెల్‌ ‌నగర కౌన్సిల్‌లో మంగళవారం ఓటింగ్‌ ‌జరగ్గా 6-1 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. కాగా ఇండియన్‌ అమెరికన్‌ ‌క్షమా సావంత్‌ ఈ ‌ప్రతిపాదనను కౌన్సిల్‌లో తీసుకొచ్చారు. అయితే ఈ అంశంపై మాట్లాడేందుకు 100 మందికిపైగా గత వారం ప్రారంభంలోనే నమోదు చేసుకున్నారు.భారతీయులు అత్యంత ఎక్కువగా ఉండే దేశాల్లో అమెరికా కూడా ఒకటి.

అమెరికాలో 1980 నాటికి 2,06,000 మంది భారతీయులు ఉండగా 2021 నాటికి ఆ సంఖ్య 27 లక్షలకు పెరిగిందని మైగ్రేషన్‌ ‌పాలసీ ఇనిస్టిట్యూట్‌ ‌గణాంకాలు చెప్తున్నాయి.  కాగా గత మూడేళ్ల కాలంలో అమెరికాలోని అనేక కాలేజీలు, యూనివర్సిటీలు కుల వివక్షను నిషేధించడానికి ముందుకొచ్చాయి. 2019 డిసెంబర్‌లో బోస్టన్‌ ‌సపంలోని బ్రాండీస్‌ ‌యూనివర్సిటీ తమ వివక్ష రహిత విధానంలో కులాన్ని చేర్చింది. అలా కులవివక్షను నిషేధించిన తొలి అమెరికా యూనివర్సిటీగా అది గుర్తింపు పొందింది.అనంతరం యూనివర్సిటీ ఆఫ్‌ ‌కాలిఫోర్నియా, కాల్బీ కాలేజ్‌, ‌బ్రౌన్‌ ‌యూనివర్సిటీ వంటివీ అదే మార్గంలో నడిచాయి. హార్వర్డ్ ‌యూనివర్సిటీ కూడా 2021లో ఈ తరహా విధానం తీసుకొచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *