సినిమాటోగ్ర‌ఫీ మంత్రిగా కోమ‌టిరెడ్డి

కూకట్ పల్లి, ప్రజాతంత్ర, డిసెంబర్ 19 : కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రిగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. గ‌తంలో 2009లో రాజ‌శేఖ‌ర్ రెడ్డి హాయాంలో తొలిసారి మంత్రిగా బాధ్య‌తలు చేప‌ట్టిన ఆయ‌న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్పోర్ట్స్, యూత్, కమ్యూనికేషన్స్, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, సహజవాయువు పరిశ్రమల మంత్రిగా ప‌ని చేశారు. అనంత‌రం ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మం స‌మ‌యంలో త‌న ప‌ద‌వికి రాజీనామా చేసి అధికార ప్ర‌భుత్వంపై పోరాడిన మొద‌టి వ్య‌క్తిగా పేరు తెచ్చుకున్నాడు.
న‌ల్ల‌గొండ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డికి రోడ్డు భ‌వ‌నాలు, సినిమాటోగ్ర‌ఫీ శాఖ‌ల‌ను సీఎం కేటాయించారు. మంగళవారం నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రాఫి శాఖ మంత్రిగా ఎన్నికైన సందర్బంగా తెలంగాణ రాష్ట్ర చలన చిత్ర వాణిజ్య మండలి కార్యవర్గ సభ్యుడు, సినీ నిర్మాత, పట్టభద్రుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు గొట్టిముక్కల పాండురంగ రావు, సినీ ప్రముఖులు మంగళవారం అయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సునీల్ నారాంగ్, కార్యదర్శి అనుపమ్ రెడ్డి, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు దిల్ రాజు, కార్యదర్శి దామోదర ప్రసాద్, తెలంగాణ సినిమా రచయితల సంఘం అధ్యక్షులు పులి అమృత్, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కార్యదర్శి టీ ప్రసన్న కుమార్, దర్శకులు కే రాఘవేంద్ర రావు, సినీ నిర్మాతలు దగ్గుబాటి సురేష్, సి కళ్యాణ్, తమ్మలపల్లి రామసత్యనారాయణ, సుధాకర్ రెడ్డి తదితర ప్రముఖులు కలిసి సినిమా రంగంలోని పలు విషయాలపై చర్చించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *