- కమిట్మెంటు ఉన్న లీడర్ హరీష్ రావు
- త్వరలో సిఎం కేసీఆర్ మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నారు
- రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- కేసీఆర్ హయాంలో ఐటితో పాటు వ్యవసాయమూ పెరిగిందన్న మంత్రి హరీష్ రావు
- సిద్దిపేటలో ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో బీ ఫార్మసీ కళాశాల
సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11 : అభివృద్ధిలో దేశమంతా తెలంగాణను మోడల్ అని చెప్తుంటే…తెలంగాణకే సిద్ధిపేట మోడల్‌గా నిలిచిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి కొనియాడారు. మంత్రి హరీష్‌రావుపై ఆమె ప్రశంసలు కురిపించారు. సోమవారం సిద్ధిపేట-రామంచలో ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ రంగనాయకస్వామి బి.ఫార్మసీ కళాశాలను మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తన్నీరు హరీష్‌రావు, మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ, ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులతో కలిసి ప్రారంభించారు. ఈ సదర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ…మంత్రి హరీష్‌రావు ఇప్పుడే కాదు తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో కూడా మేము అప్పుడు అధికారం(కాంగ్రెస్)లో ఉన్నప్పుడు హరీష్ రావు ఎక్కడ ఏ నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారని ప్రభుత్వం పరిశీలించేదన్నారు.
ఉద్యమంలో ఏదైతే ఆరాటం, తపన ఉండేదో ఇప్పుడు కూడా అదే కమిట్మెంటుతో హరీష్ రావు ఉన్నాడన్నారు. సిద్ధిపేటలో మంత్రి హరీష్‌రావు మెజారిటీతో ఎవరూ కూడా పోటీ పడే పరిస్థితిలో ఉండరన్నారు. బి.ఫార్మసీ కాలేజ్ అన్ని అనుమతులు పొంది ఈరోజు ప్రారంభించుకోవడం అంటే దాని వెనుక మంత్రి హరీష్ రావు కృషి తప్పకుండా ఉందన్నారు. సిఎం కేసీఆర్ కేజీ టు పీజీ విద్య అనే చెప్పారు. అది ఇంప్లిమెంట్ చేసేందుకే తామంతా కృషి చేస్తున్నామన్నారు. గడిచిన తొమ్మిదేళ్లలో వెయ్యి గురుకులాలు ఏర్పాటు చేసి దేశంలోనే ఎక్కడా లేని విధంగా నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. అలాగే, 1450 గురుకుల జూనియర్ కాలేజీలను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ముందు నుండి మహిళ విద్య కోసం పాటుపడే ఎగ్జిబిషన్ సొసైటీకి తన అభినందనలు తెలిపారు. త్వరలో ముఖ్యమంత్రి మహిళా యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయబోతున్నారనీ, ఆడపిల్లల చదువుకు ప్రాధాన్యత ఇస్తున్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలన్నారు.
కేసీఆర్ హయాంలో ఐటితో పాటు వ్యవసాయమూ పెరిగింది : మంత్రి హరీష్‌రావు
ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐటి…ఐటి అని మాత్రమే అనేవాడనీ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ సిఎం అయ్యాక కేసీఆర్ హయాంలో హైదరాబాద్‌లో ఐటితో పాటు గ్రామాల్లో వ్యవసాయమూ కూడా పెరిగిందని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు చెప్పుకొచ్చారు. బి.ఫార్మసీ కళాశాల ప్రారంభోత్సవ సభలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ…ఐటి ఉత్పత్తుల్లోనూ తెలంగాణ నెంబర్ వన్‌గా ఉందిదనీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 3 లక్షల ఐటి ఉద్యోగాలు ఉంటే ఈరోజు 10 లక్షల ఐటి ఉద్యోగాలకు తెలంగాణ నిలయంగా మారిందన్నారు. హైదరాబాద్ నగరంలో ఎలాంటి సౌకర్యాలయితే ఉన్నాయో అదేవిధంగా మారుమూల గ్రామంలో కూడా అవే సౌకర్యాలు తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అందిస్తుందన్నారు. సిద్ధిపేటనే కాదు తెలంగాణలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాయనీ, ప్రతి గ్రామం అభివృద్ధి చెందుతుందన్నారు.
ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐటి…ఐటి అని మాత్రమే అనేవాడనీ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ సిఎం అయ్యాక కేసీఆర్ హయాంలో హైదరాబాద్‌లో ఐటితో పాటు గ్రామాల్లో వ్యవసాయమూ కూడా పెరిగిందని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు చెప్పుకొచ్చారు. బి.ఫార్మసీ కళాశాల ప్రారంభోత్సవ సభలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ…ఐటి ఉత్పత్తుల్లోనూ తెలంగాణ నెంబర్ వన్‌గా ఉందిదనీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 3 లక్షల ఐటి ఉద్యోగాలు ఉంటే ఈరోజు 10 లక్షల ఐటి ఉద్యోగాలకు తెలంగాణ నిలయంగా మారిందన్నారు. హైదరాబాద్ నగరంలో ఎలాంటి సౌకర్యాలయితే ఉన్నాయో అదేవిధంగా మారుమూల గ్రామంలో కూడా అవే సౌకర్యాలు తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అందిస్తుందన్నారు. సిద్ధిపేటనే కాదు తెలంగాణలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాయనీ, ప్రతి గ్రామం అభివృద్ధి చెందుతుందన్నారు.
ధాన్యం ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందనీ, అదేవిధంగా డాక్టర్ల ఉత్పత్తిలో కూడా తెలంగాణ నెంబర్1గా ఉందన్నారు. ప్రతి లక్ష జనాభాకు 22ఎంబిబిఎస్ సీట్లు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. దేశంలో కోతలు లేకుండా 24 గంటల కరెంటు ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమన్నారు. ప్రధానమంత్రి మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో కూడా 24 గంటల కరెంటు ఇవ్వలేకపోతున్నారన్నారు. దేశంలో అతి ఎక్కువ తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమనీ, అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలిచేందుకు బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పోటీ పడుతుంటే ప్రతిపక్షాలు మాత్రం తిట్టడంలో పోటీ పడుతున్నాయన్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకు పోతామన్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారా మరిన్ని మంచి కార్యక్రమాలు చేసేందుకు కృషి చేస్తామనీ, హైదరాబాద్‌లో మాత్రమే జరిగే ఎగ్జిబిషన్లను ఇప్పటి నుంచి అన్ని జిల్లాల్లో నిర్వహించాలని నిర్ణయించామన్నారు. మహిళా విద్యాభివృద్ధికి ఎంతగానో కృషి చేసింది ఎగ్జిబిషన్ సొసైటీ అన్నారు.
ఎంతో మందికి విద్యను ఉపాధిని కల్పిస్తుంది ఎగ్జిబిషన్స్ సొసైటీ అన్నారు. సిద్దిపేటలో బిఫార్మసీ కాలేజ్ ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందనీ, కాలేజీ ప్రారంభోత్సవానికి విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి వొచ్చినందుకు హరీష్ రావు ధన్యవాదాలు తెలిపారు. 8 నెలల్లోనే అన్ని రకాల అనుమతులు తీసుకొని ఈ సంవత్సరం కాలేజీని ప్రారంభించుకోవడం గొప్ప విషయమన్నారు. విద్యాలయాలకు ఆలయం సిద్దిపేట అని, అన్ని రకాల చదువులతో ఈరోజు సిద్దిపేట జిల్లా విరాజిల్లుతుందన్నారు. మెడికల్ కాలేజ్, అగ్రికల్చర్ కాలేజ్, వెటర్నరీ కాలేజ్, ఫార్మసీ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ ఇలా అన్ని రకాల విద్యలు సిద్దిపేటలో అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నకోడూరు ఎంపిపి మాణిక్యరెడ్డి, బి.ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మరియు ఎగ్జిబీషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు అశ్విన్ మార్గం, గౌరవ కార్యదర్శి సాచినాథ్ దయాకర్ శాస్త్రి, ఎస్ఆర్ఎన్ఎస్సిపి చైర్మన్ డా. బి ప్రభాశంకర్, గౌరవ కార్యదర్శి ఆర్ సుకేష్ రెడ్డి, ఎగ్జిబిషన్ సొసైటీ ఇతర సభ్యులు, ఆర్థిక కమిటీ మరియు ఉస్మానియా పట్టభద్రుల సంఘం పాల్గొన్నారు.




