- 98 పనులకు రూ.8,175.92 కోట్లు
- వెల్లడించిన ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు
సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 5 : సిద్ధిపేట జిల్లాలో రోడ్లకు మహార్దశ పట్టనున్నది. జిల్లాలో రహదారుల పరిస్థితి, ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించి…గతంలో జిల్లా పర్యటనలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ప్రభుత్వానికి ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ రోడ్ల పునర్నిర్మాణంపై స్పెషల్ ఫోకస్ పెట్టి వే కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. పెద్దయెత్తున మంజూరైన నిధులతో కొంత కాలంగా కనీస మరమ్మతులు కూడా నోచుకోని రోడ్లు ఇప్పుడు పునర్జీవం పోసుకున్నాయి.
జిల్లాలోని గజ్వేల్, దుబ్బాక, సిద్ధిపేట, హుస్నాబాద్, జనగాం, మానకొండూరు తదితర ప్రాంతాలలోని 98 పనులకుగానూ స్పెషల్ డెవల్‌ప్‌మెంటు ఫండ్స్(ఎస్‌డిఎఫ్)ద్వారా 8వేల 175కోట్ల 92లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు మంగళవారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.
సిద్ధిపేట జిల్లాలోని గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలో 8 రోడ్డు పనులకు 786 కోట్ల 28 లక్షల రూపాయలు, సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో 34 పనులకు గానూ 1789 కోట్ల 28 లక్షల రూపాయలు, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో 32 పనులకు 3 వేల 460కోట్ల 36లక్షల రూపాయలు, హుస్నాబాద్ నియోజకవర్గంలో 14పనులకు 1161కోట్ల రూపాయలు, జనగాం ఏరియాలో 8 పనులకు 809కోట్ల రూపాయలు, మానకొండూరులో 2 పనులకుగానూ 170కోట్ల రూపాయలు మొత్తంగా 8వేల 175కోట్ల 92క్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.




