సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 28: సిద్దిపేట ఫుట్ బాల్ స్టేడియం లో ఇంటర్ స్కూల్ డిస్ట్రిక్ట్ ఫుట్ బాల్ చాంపియన్ షిప్ పోటీలను ప్రారంభించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు..ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతూ..సిద్దిపేట ఫుట్ బాల్ స్టేడియం అద్భుతంగా చేసుకున్నాము.మీరు అద్భుతమైన క్రీడను ప్రదర్శించి జాతీయ స్థాయి లో ఎదగాలి. సిద్దిపేట కు మన రాష్ట్రం కు భారత దేశానికి మంచి పేరు తేవాలి.విద్య ఎంత ముఖ్యమో క్రీడా అంతే ముఖ్యం… అదే స్ఫూర్తి తో ఆడాలి.విద్య తో పాటు క్రీడలో పోటీ తత్వం అలవరరుచుకోవాలి. అన్ని  జాతీయ స్థాయి ఆటలకు వేదిక మన సిద్దిపేట
సిద్దిపేట క్రీడా కారులు ఆటల్లో అగ్రగామిగా నిలవాలి.
ఆటలు అదుర్స్‌ అనేలా  అన్ని ఆటలు సిద్దిపేట లో  ఏర్పాటు చేసాము.పాఠశాలల స్థాయికే పరిమితమైన క్రీడాకారులను జాతీయ  స్థాయికి పోటీలకు పంపేల  సిద్దిపేటలో అన్ని రకాల క్రీడల ఏర్పాటు చేసాము.
ఈ ఆట ఆ ఆట అని కాదు అన్ని ఆటలకు నెలవు గా సిద్దిపేట క్రీడలు ఉన్నాయ్.చదువుతోపాటు క్రీడల్లోనూ ప్రతిభ చూపించినవారికి మంచి భవిష్యత్తు సాధ్యమవుతుంది.అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో 16 రకాల క్రీడలకు సంబంధించిన మైదానాలు, కోర్టులు, సౌకర్యాలను సిద్దిపేటలో ఏర్పాటు చేయడం వల్ల అనేక జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీలకు అతిథ్యం ఇవ్వడం జరిగింది.స్విమ్మింగ్ ఫుల్ జాతీయ స్థాయిలో పోటిలకు, బ్యాట్మెంటన్ , వాలి బాల్ రాష్ట్ర జాతీయ స్థాయి సెలెక్షన్స్  , ఫుట్ బాల్ సెలెక్షన్స్, రంగనాయక సాగర్ వద్ద జాతీయ స్థాయి సైక్లింగ్ పోటీలు వేదిక మన సిద్దిపేట అయింది అంటే మన సిద్దిపేట క్రీడా అభివృద్ధి ఎంత చేసుకునం.
– నేడు సిద్దిపేట స్పోర్ట్స్ హబ్ గా మారింది…
– ప్లడ్  లైట్స్ వెలుగులతో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేసుకున్నాము.. కొంతమంది క్రీడా కారులను రంజీ ట్రోపి లు సెలెక్షన్ చేసుకున్నాం.
సిద్దిపేట క్రీడా కాంప్లెక్స్ లో మరో 11కోట్లతో అభివృద్ధి చేయబోతున్నాం.క్రికెట్ స్టేడియం కు 4  కోట్ల తో అభివృద్ధి చేయబోతున్నాం.క్రికెట్‌, ఫుట్‌బాల్‌, బాస్కెట్‌ బాల్‌, బ్యాడ్మింటన్‌, కబడ్డీ, ఖోఖో, హాకీ, కరాటే, రన్నింగ్‌, హ్యాండ్‌ బాల్‌, షాట్‌పుట్‌, స్కెటింగ్‌, అథ్లెటిక్స్‌ తోపాటు ఇటీవలే నూతన వాలీబాల్‌ అకాడమీ ఏర్పాటైంది. 5 కోట్ల తో మల్టిపర్పస్ ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేస్తున్నాము.. స్పోర్ట్స్ హాస్టల్ ఏర్పాటు చేయబోతున్నాం. ఇప్పటికే 50 లక్షలతో వాలి బాల్ స్టేడియం ను తయారు చేసుకున్నాం.. మరో 50 లక్ష లతో స్టేడీయాన్ని మరింత ఆధునీకరణ చేయబోతున్నాము. రూ.2కోట్ల తో ఫుట్ బాల్ స్టేడియం ను అద్భుతంగా తయారు చేసుకొని అందుబాటులో కి తెచ్చినము.ఈ సందర్బంగా ఇటీవల జాతీయ స్థాయి లో ఎంపిక అయిన జమ్మూ కాశ్మీర్ లో ఆడిన అబ్దుల్ సమద్ ను, రాష్ట్ర స్థాయి లో ఎంపిక అయిన శివ గణేష్ ను అభిందించారు.