న్యాక్ ఏ + గ్రేడ్ సాదించిన సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల
సంతోషం వ్యక్తం చేస్తూ,అధ్యాపాకులకు, అభినందనలు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు
సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 22: సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల కు న్యాక్ లో ఏ +గ్రేడ్ తో రాష్ట్రంలో రెండవ స్థానం లో నిలిచిన సందర్బంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సంతోషం వ్యక్తం చేశారు.ఎన్నో ఏళ్ల ఘన కీర్తి కలిగిన, ఎంతో మంది చదివి ఉన్నత స్థాయి లో తీర్చిదిద్దిన సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరో కీర్తి ఘటించింది.. న్యాక్ గ్రేడింగ్ లో మరో ముందడుగు వేసింది..ఇటీవల న్యాక్ బృందం సిద్దిపేట డిగ్రీ కళాశాల ను సందర్శించారు.వారు కళాశాల పని తీరు ఫై సంతృప్తి వ్యక్తం చేస్తూ సిద్దిపేట డిగ్రీ కళాశాల ఏ +గ్రేడ్ గా గుర్తింపునిచ్చారు. రాష్ట్రం లో ఖమ్మం మొదటి స్థానం లో నిల్వగ సిద్దిపేట డిగ్రీ కళాశాల రెండవ స్థానం లో నిలిచించింది.ఈ సందర్బంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సంతోషం వ్యక్తం చేశారు. ఎంతో శ్రమ తో కళాశాలను వరుసగా నాల్గవ సారి న్యాక్ గుర్తింపు ను పెంచుకుంటూ పోతున్న అధ్యాపకుల కృషి కి అభినందించారు.విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.ఇదే స్ఫూర్తి తో కళాశాల కు మరిన్ని గుర్తింపు తీసుకరావాలని, మీ సమిష్టి కృషి కి నా పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హరీష్ రావు అన్నారు.





