సిద్దిపేట ప్రజల్ని విద్యుత్ బిల్లు ఎగవేతదారులుగా  మాట్లాడడం సీఎం రేవంత్ రెడ్డి స్థాయికి తగదు

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 22:  నిన్న అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  విద్యుత్  శ్వేత పత్రం విడుదలలో  భాగంగా సిద్దిపేట ప్రాంతం పట్ల వివక్షపూరితంగా మాట్లాడడం ఒక ముఖ్యమంత్రి స్థాయికి తగదని నిజంగా బకాయిలే ఉండి ఉంటే అవి ఏ రకమైన బకాయిలు? వ్యవస్థవా?సంస్థలయా? లేదా ప్రజలయా? వివరాలు చెప్పకుండా కేవలం సిద్ధిపేట విద్యుత్ బకాయిల్లో నంబర్ వన్ అని మాట్లాడడంలో సిద్దిపేట ప్రాంతం చారిత్రకంగా ప్రఖ్యాతి చెందినటువంటి సుప్రసిద్ధమైనటువంటి అనేక పోరాటాల ప్రజా ఉద్యమాలకు ఒక ఆదర్శప్రాయం అయినటువంటిప్రాంతం. జాతీయస్థాయిలో రాష్ట్రస్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులు పొంది  అభివృద్ధి సంక్షేమము ప్రజల భాగస్వామ్యంలోమిగతా ప్రాంతాలకి ఆదర్శ ప్రాయం గా నిలిచి ప్రఖ్యాతి చెందింది. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవేవి పట్టకుండా నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ప్రాతినిధ్యం లేదు అని, అక్కస్తో మాట్లాడినట్టుగా ఉంది  ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు ఒక ప్రాంతం పట్ల వివక్షపూరితంగా మాట్లాడడం  భవిష్యత్తులో ఆయన నడవబోయే మార్గాన్ని సూచిస్తుందేమో అనిపిస్తుంది. ఇప్పటికైనా వారు తమ ఆలోచన ధోరణి వ్యవహరించాల్సిన తీరు మార్చుకోవాలని కోరుతున్నాం. సిద్దిపేట ప్రాంతం మట్టి బిడ్డలమైన మేము అవమానకరంగా భావిస్తున్నాం.ఆకలినైనా భరిస్తాం గానీ ఈ ప్రాంత గౌరవానికి కించపరచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.అణచివేతకు అసమన్యాయానికి వ్యతిరేకిస్తూ అనేక ప్రజా ఉద్యమాలకు నాయకత్వం అయినటువంటి ఈ ప్రాంతం మట్టి బిడ్డలుగా ఖండిస్తూ భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నాం.పోచబోయిన శ్రీహరి యాదవ్, లక్కరసు ప్రభాకర్ వర్మ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *