సిద్దిపేట నియోజకవర్గం లో బీఎస్పీ జెండా ఎగరేస్తాం

సిద్దిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: బహుజన సమాజ్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో సిద్దిపేట నియోజకవర్గ అధ్యక్షుడు పుల్లూరు ఉమేష్ అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ కార్యవర్గ సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి లింగంపల్లి యాదగిరి హాజరై మాట్లాడుతూ… సిద్దిపేట నియోజకవర్గంలో బహుజన్ సమాజ్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. బిఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అవినీతి  గురించి ప్రజలకు వివరిస్తూ రానున్న రోజుల్లో సిద్దిపేటలో బిఆర్ఎస్ కూ బీఎస్పీ సరైన బుద్ధి చెప్తుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. బూత్ కమిటీలని త్వరగా పూర్తిచేసి ఎలక్షన్ లో బిఎస్పి సత్తా చూపెట్టాలని  తెలియజేశారు. సిద్ధిపేటలో రైలు ప్రారంభోత్సవంలో బిఆర్ఎస్, బిజెపి పార్టీ నాయకులు వీధి రౌడీ లా ప్రవర్తించడం సిగ్గుచేటని అన్నారు. ఈ కార్యక్రమంలో రోమాల బాబు, అశోక్, బాబు, మల్లేశం ముదిరాజ్, నర్సింలు,కిరణ్, మహేష్, శంకర్, రాజు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *