సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కి నూతన సంవత్సర శుభాకాంక్షలు

సిద్దిపేట, ప్రజాతంత్ర, జనవరి 3: తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ సిద్దిపేట జిల్లా ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిద్దిపేట ఉద్యోగులందరికీ మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ కొత్త సంవత్సరంలో కొత్త ఆశలతో అందరూ ఉద్యోగస్తులు పనిచేయాలని తెలంగాణ రాష్ట్రంలోనే ఉద్యోగులందరూ కూడా ఉత్తమంగా పనిచేసే సిద్దిపేట జిల్లాను అన్ని రంగాలలో ముందు ఉండే విధంగా చూడాలని, మంచి చెడులన్నీ ఏ సమస్య వచ్చినా మా దగ్గర తీసుకొస్తే సమస్యను పరిష్కరించే విధంగా ఆలోచిస్తామని పోయిన సంవత్సరంలో ఎలాగైతే ఉద్యోగులు పనిచేసే జిల్లాకు అవార్డులు తెచ్చిపెట్టారు అదే రకంగా ఈ సంవత్సరం కూడా పనిచేసే ఇంకా అన్ని రంగాలలో అవార్డులు రివార్డులు తీసుకొని రావాలని కోరారు. ఈ సందర్భంగా టీఎన్జీవో సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గ్యాలరీ పరమేశ్వర్ కార్యదర్శి కోమండ్ల విక్రం రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులందరికీ నూతన శుభాకాంక్షలు తెలియజేస్తూ సిద్దిపేట జిల్లాలో అన్ని రంగాల్లో ముందు ఉంచే విధంగా ఉద్యోగస్తులు శ్రమిస్తూ ఉన్నారని వర్షముకుతగా ఫలితంగా ఎన్నో అవార్డులు రివార్డులు వచ్చాయని, అంతే స్థాయిలో ఈ సంవత్సరం కూడా పనిచేసే ఎన్నో అవార్డులు రివార్డు సిద్దిపేట జిల్లాకు తీసుకొస్తామని తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కాకుండానే భారతదేశం లోనే అత్యుత్తమ జిల్లాగా సిద్ధిపేట ను తీర్చిదిద్దే ఆవశ్యకత ఉద్యోగులపై ఎంతో ఉందని అన్ని వేళల్లో ఉద్యోగులందరూ కూడా అందుబాటులో ఉండి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని, అన్ని సమస్యలపై గారితో ఒకరోజు చర్చించి పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాధ్యక్షుడు సురేందర్ రెడ్డి, కోశాధికారి అశ్వక్, అహ్మద్, మహిళా ఉద్యోగులు వినయ్ కుమార్, సుజాత, టిఎన్జిఎస్ అధ్యక్షులు నరేష్, కార్యదర్శి నగేష్, సిద్దిపేట యూనిట్ అధ్యక్షులు శశిధర్, గజ్వేల్ యూనిట్ అధ్యక్షులు లింగం, జిల్లా కార్యవర్గ సభ్యులు కలెక్టర్ ఉద్యోగస్తులు సిద్దిపేట ఉద్యోగస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *