సిద్దిపేట అభివృద్ధిని చూసి రాష్ట్రo గర్వ పడుతుంది

సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 13: సిద్దిపేట పట్టణ 24 వ వార్డులో సోమవారంబిఅరెస్ పార్టీ అభ్యర్థి, మంత్రి హరీశ్ రావు తరపున ప్రచారం నిర్వహించిన సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ కడవేరుగు మంజుల రాజనర్సు.వార్డులో ఇంటింటికి కలియతిరుగుతూ సిద్దిపేట అభివృద్ధిపై ప్రచురించిన కరపత్రాలు, పుస్తకాలను అందజేస్తూ కారు గుర్తుకు ఓటు వేసి హరీశ్ రావునుభారీ మెజారిటీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు.సిద్దిపేట పట్టణంలో బిఅరెస్ పార్టీ ప్రచారం నిర్వహించకపోయిన మా కుటుంబంలోని ఓట్లు తప్పక మంత్రి హరీశ్ రావు కారు గుర్తుకె వేస్తామని ప్రజలు హామీ ఇచ్చారు.
ఆంద్రప్రదేశ్ నుంచి వచ్చిన కుంద మహీంద్ర దంపతులు.. 13 సంవత్సరాల క్రితం సిద్దిపేట పట్టణానికి వచ్చి ఇక్కడే స్థిరపడ్డామని కొత్తలో వచ్చినప్పుడు పట్టణంలో పందులు గుంపులుగా సంచరించేవని ఇప్పుడు సిద్దిపేట పట్టణంలో పందులు అంతరించిపోయావని చెప్పారు. అదేవిధంగా మేము చూసిన అప్పటి సిద్దిపేట ఇప్పటి సిద్దిపేట ఎంతగానో అభివృద్ధి చెందిందని ,ఒకప్పుడు ఏ అవసరం ఉన్న హైదరాబాద్ కి వెళ్ళిరావడం జరిగేదని కానీ ఇప్పుడు మంత్రి హరీశ్ రావు చేసినటువంటి అభివృద్ధిలో భాగంగా సిద్దిపేటలో ప్రతీది అందుబాటులో ఉంటుందని చెప్పారు. సిద్దిపేట పట్టణాన్ని మంత్రి హరీశ్ రావు గారు ఎంతగానో అభివృద్ధి చేసారని అన్నారు.బిఅరెస్ ప్రభుత్వానికి ఎదురులేదు కేసీఆర్ గురువు మృత్యుoజయ శర్మ. ప్రచారంలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్సు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గురువు మృత్యుoజయ శర్మ నివాసానికి వెళ్లి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరగా… మృత్యుoజయ శర్మ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు , బిఅరెస్ పార్టీకి తిరుగుండదు అని అన్నారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్సు మృత్యుoజయ శర్మ ఆశీర్వాదం తీసుకున్నారు.ప్రచారంలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్సు బ్రమ్మకుమారిస్ వారి నివాసానికి వెళ్లి కొద్దిసేపు ప్రజాప్రీత బ్రహ్మ గారి ధ్యానం చేశారు.ఈ 15 రోజులు బిఅరెస్ పార్టీ ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేస్తే వచ్చే ఐదేండ్లు మంత్రి హరీశ్ రావు సిద్దిపేట అభివృద్ధి కోసం, మన కోసం కష్టపడుతారని అన్నారు.కార్యక్రమంలో వార్డు బిఅరెస్ పార్టీ అధ్యక్షుడు రామచందర్ రావు ,కడవేరుగు సాయికుమార్, రాజిరెడ్డి, తుమ్మ గోపి,వంద ఓట్ల ఇంచార్జిలు,పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *