• లింగంపల్లి, కాచిచూగడ, హైటెక్ సిటీ రైల్వేస్టేషన్లపై దృష్టి
• పలు స్టేషన్ల నుండి దూరప్రాంతాలకు రాకపోకలు సాగించేలా ప్రణాళికలు
హైదరాబాద్,సెప్టెంబర్11: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌పై రోజురోజుకు తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. దీంతో లింగంపల్లి, కాచిచూగడ, హైటెక్ సిటీ రైల్వేస్టేషన్ల నుంచి దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించేలా దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే లింగంపల్లి-విజయవాడ-లింగంపల్లి ఎంప్లాయిస్ ట్రైన్, లింగంపల్లి-విశాఖపట్నం-లింగం
కాచిగూడ నుంచి బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ రైళ్లను పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవి మల్కాలిజిగిరి, మౌలాలి స్టేషన్లలో ఆపాలని నిర్ణయించారు. చర్లపల్లి రైల్వేస్టేషన్ లో 6 ప్లాట్ ఫారాలున్నాయి. యాదగిరిగుట్ట వరకు మూడో లైను సిద్ధమవుతోంది. మౌలాలి నుంచి చర్లపల్లి దాటి ఘట్ కేసర్ వరకు 4 లైన్లున్నాయి. దూర ప్రాంతాల రైళ్లు ఇక్కడి నుంచి సులభంగా రాకపోకలు సాగించేలా చూస్తున్నారు. రెండోదశలో ఎంఎంటీఎస్ రైళ్లు 2024 జనవరి నుంచి ఘట్ కేసర్ వరకు పరుగులు తీయనున్నాయి. ఎంఎంటీఎస్‌లో చర్లపల్లి చేరుకొని అక్కడి నుంచి ప్రయాణం చేయవచ్చు.లింగంపల్లి నుంచి బయలుదేరే ప్రతి రైలు హైటెక్ సిటీలో ఆగి సనత్ నగర్ – మౌలాలి మధ్య ఎంఎంటీఎస్ రెండో దశలో నిర్మించిన అదనపు లైను ద్వారా చర్లపల్లికి చేరుకునే ఏర్పాట్లు చేస్తున్నారు. కాచిగూడ నుంచి వచ్చే రైళ్లు సీతాఫల్ మండి మీదగా మల్కాజిగిరి, మౌలాలి చేరుకుంటాయి.




